పోవకు బిడ్డో ....పోవకు బిడ్డ
ఆ తెలంగాణా వస్తే వచ్చే ....పాతే పాయె .....
పోవకు బిడ్డో ...నువ్వు నన్నొదిలి పోవకు బిడ్డ
ఉక్కునరం బిగపట్టి , కండ్లంత ఎరుపు సూపి
రోమాలని నిక్క బొడచి, చేతి లోన రాయి పట్టి
తెలంగాణా....తెలంగాణా గానమేత్హి ...
పోవకు బిడ్డో నువ్వు పోవకు బిడ్డ ..నువ్వు నన్నొదిలి పోవకు బిడ్డో ..;పోవకు బిడ్డ
రాల్లెతి కొడుతున్నారు....... ఆల్లు రాల్లెతి కొడుతున్నారు నా బిడ్డ
అది నీకోచి తాకిందో, నేను ఈడ కుప్ప కూలిపోవాలే
పోలిసోల్లు ..ఆ పోలిసోల్లు.. తుపకిలేక్కు పెడుతున్నారు
ఆ గుండు నిను తాకి పోయిందో నా గుండె ఆగి పోతది
మూకంత కలిసి గట్టి ఎందేందో సేస్తున్నారు
గూండా గాళ్ళని కలగలిపి రగడ రగడ సేస్తున్నారు
కనిపించిన దాన్నాళ్ళ నిప్పెట్టి తగలేడుతున్నారు.................. నా కొడక
ఆ మంట నీ కంటితే, నే నిప్పుల్లో దూకాలే
నీ అయ్యా నీ అవ్వ నిను సూసి మురుస్తుండే
పైకొచ్చి పనికోస్తావని
ముధసరిలో మంధవుతావని
చేయిచ్చి నడిపిస్తావని ... చెతికంది వస్తావని
...నీ అయ్యా నీ అవ్వ నిన్ను సూసి మురుస్తుండే
పోవకు బిడ్డో పోవకు బిడ్డ నా కంట కన్నీరు మిగల్చనీకి
నువ్వు నన్నొదిలి ................. పోవకు బిడ్డో పోవకు బిడ్డ !!!!!!!!!!!
No comments:
Post a Comment
Please comment...