Pages

Tuesday, December 25, 2012

రేప్ ల భారతం ....

రేప్ ల భారతం ....


ద్రౌపది ని నిండు సభలో వివత్సరని చేయడానికి కౌరవులు ప్రయత్నించినందుకు గాను మాత్రమె కురుక్షేత్రం  యుద్ధం సంభవించింది. సీత దేవి అపహరణకు గాను మాత్రమె రామాయణ మహా యుద్ధం సంబవించింది. రెండిటిలోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రామాయణ మహాభారతాలు రెండు మహిళ చుట్టూనే మహిళ కోసమే జరిగినాయి. రాముడు ఉన్న కాలం లో రావణుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్న కాలం లో దుర్యోధనుడు ఉన్నాడు. కాని అధర్మం పైన ధర్మం, అసత్యం పైన సత్యం విజయాన్ని సాధిస్తాయని, ఈ సత్యాన్ని సర్వ వ్యాప్తి చేసి ప్రజలలో ధర్మ విచక్షణ రావాలని ఆనాటి చరిత్రలని ఈనాటికి చెప్పుకుంటూనే ఉన్నాము.

ఢిల్లీ లో జరిగిన సంఘటన ఈరోజు కొత్తగా జరిగినది కాదు, మనమెప్పుడు విననిది కాదు. రోజు ప్యాపర్ చదివే అలవాటు ఉంటె ఆ మూలనో ఈ మూలనో ప్రతిరోజు కనిపించే వార్త "యువతి పై అత్యాచారం", ఇక బీహార్, ఉత్తరప్రదేశ్ లో అయితే అది ఒక రోజు వారి క్రీడ . అగ్ర కులం వారు, కింద కులాల ఆడవారు తమ వాంఛలు తీర్చే బొమ్మలుగా భావిస్తారు అక్కడ. కులం పేరుతోనో, అవసరం  పేరుతోనో, అవకాశాల పేరుతోనో  ఒక మగువ ని లొంగ తీసుకుని శరీరాన్ని అనుభవించే కుక్కలు గురించి మనం వింటూనే ఉంటాము..
ఇండియా లో లెక్కల ప్రకారం (కేవలం లెక్కల ప్రకారం మాత్రమే ) ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది, అందులో 25% కన్నా తక్కువ వాటిలో మాత్ర మే శిక్షలు పడుతున్నాయి, శిక్షలు కూడా నామమాత్రముగా ఉన్నాయి (1 లేదా 2 సంవత్సరాలు). ఈ సంవత్సరం మొత్తం 25,000 పైన రేప్ కేసులు నమోదయ్యాయి, లైగిక వేధింపులుతో కలుపుకుని అసలు సంఖ్య  కనీసం లక్షకి ధాటి ఉంటుంది, అంటే ప్రతి 500 మంది మహిలల్లో ఒకళ్ళు మన దేశం లో వేధింపులకి గురి అవుతున్నారు. అంటే రేప్ లని నిరోధించడం లో గాని, వాళ్ళని పట్టుకోడం లో గాని, మరియు కోర్టుల్లో శిక్షలు పడేటట్టు చెయ్యడం లో గాని మన  సంస్థలు ఎంతగా నిర్వీర్యం చెందాయో అర్ధమవుతుంది. కాకపోతే భారత దేశం లో ప్రభుత్వ సంస్థలు పనిచెయ్యకపోవడం అనేది మనకు అలవాటు అయిపోయినాయి కాబట్టి, ఈ విషయం లో మన చర్మము స్పందించదు కాబట్టి  దీని గురించి పదే పదే మాట్లాడుకున్న అనవసరము. , మనకు సిగ్గు వచ్చి మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే వరకు మార్పు కోరుకోవడానికి మనం అనర్హులం.
 బొత్స సత్యన్నారాయణ డిల్లీ సంగటన పైన మాట్లాడుతూ అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కదా అని అర్ధరాత్రి తిరిగితే ఎలా అని ప్రశ్నిచాడు. మనకి సిగ్గే ఉంటె వాడికి మల్లి వోటు వేసి గెలిపించము. కాని మనం కులానికో మతానికో ప్రాంతానికో భందుత్వానికో వోటు వేస్తాము గాబట్టి , Botsa you are safe. ఎవరో చెప్పినట్టు "India needs good leaders, but people do not deserve them" అన్నది నిజమేమో అనిపిస్తుంది.

కాని వీటి అన్నిటికన్నా ముఖ్యమయినది, అసల మన మనసుల్లో ఆడవారి పైన ఉన్న భావాలు ఏంటి. చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అన్న తేడా లేకుండా, ఆడది అంటే మగవాడి కన్నా తక్కువ అన్న అభిప్రాయం పాత తరం నుండి కొత్త తరం వరకు పాతుకు పోయి ఉంది. అమ్మ ని నాన్న, చెల్లి ని అన్న, కోడలిని మామ, చులకన చేసే  సందర్భాలు రోజు మన ముందు జరుగుతూనే ఉన్నాయి. ఇలా మన కుటుంబము లో మన పిల్లలికే చిన్నప్పుడి నుండి ఆడది అంటే మగవాడి అదుపులో ఉండే వ్యక్తి అని  చూపిస్తున్నాము. ఆవిధంగా పెరిగి పెద్ద అయిన పిల్లడు ఏమి చేస్తాడు. ఇంకా జనాలు ఎంత మూర్కత్వం లో ఉన్నారంటే, నా స్నేహితుడి స్నేహితుడు ఒకడు అమెరికా లో ఉంటాడు, తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను అన్నాడు, తనకి ఒక పాపా ఉందని, రెండవ సారి కూడా పాప అని తెలిసి తన భార్యకి అబార్షణ్  చేపించా అని , ఎంత సిగ్గు లేని పని, ఆ విష యాన్ని ఎ మాత్రం సిగ్గు లేకుండా మల్లి చెప్తున్నాడు, అది అమెరికా లో హై టెక్కు జాబ్  చెయ్యటానికి వచ్చిన వ్యక్తి. ఎన్ని చట్టాలు ఉంటె మాత్రం ఇతన్ని అదుపు చెయ్యగలము.
ఇంట్లో ఆడపిల్ల బయటికి వెళ్తే రోడ్డు పైన ఎవరన్నా ఏడిపించిన ఇంట్లో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇంట్లో ఆ అమ్మాయిని అసల నువ్వు ఆ టైం లో అక్కడేమి చేస్తున్నావని తిడతారేమో అని. మానబంగానికి ఒక అమ్మాయి గురి అయితే అబ్బాయికి శిక్ష పడిందా లేదా అని పట్టించుకోడానికి ముందే అమ్మాయిని సమాజం నుండి వెలివేసే మనస్తత్వాలు, ఎవరన్న అల్లరి చేస్తే అది అమ్మాయి బట్టలకు ముడిపెట్టి తిట్టే సమాజం, ... వీటన్నిటిలో భాదితురాలు మహిళే  దానికి శిక్ష అనుభవించేది మహిళే కావడం భాధాకరం. 

సినమల్లో కులాన్ని ప్రస్తావించారని రోడ్డు ఎక్కే జనాలు, తమ  హీరో ల కోసం రోడ్డు ఎక్కి కొట్టుకునే జనాలు, మన MLA రౌడీ అయిన దగుల్బాజీ అయిన, కబ్జా కోరు అయినా మనకెందుకులే అనుకునే జనాలు , పక్క ఇంటిలోనే మగాడు తాగి వచ్చి అమ్మనో పెల్లాన్నో  పిల్లలనో కోడతంటే, మన తలుపులు బిగవేసుకుని మన ఇంట్లో  కూర్చుంటున్న ఈరోజుల్లో,  ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి దేశ వ్యాప్తము గా ప్రజలంతా చూపించిన ఈ చైతన్యం స్పూర్తినిస్తుంది. ఈ క్రైసిస్ ని అవకాశం  గ తీసుకుని ఇప్పటికైనా చట్టాలని  అలాగే దేశం లో మహిళల ఔన్నత్యాన్ని పటిష్టం చెయ్యడానికి కృషి జరుగుతుందని ఆశిస్తూ .........

ప్రభుత్వం వైపు  నుండి నేను కోరుకునే మార్పులు/సలహాలు

1. విధిగా 8.00 PM దాటిన తర్వాత వైన్ షా పులని మూసిఎయ్యడం, లేకుంటే అక్కడ ఉన్న ప్రజలు భాగస్వాములు అయ్యి మూపించడము (ఇది చాల ముఖ్యమైనది)
2. ఆడవారికోసం ప్రత్యేక బస్సు సర్వీసులని పెంచడము
3. ఎమ్మటే పోలీస్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చి జనాభా ప్రాతిపదికన పోలిసుల సంక్యని, గస్తీ ని  పెంచడము
4. దేశ వ్యాప్తముగా 911 వంటి సర్వీసుని త్వరిత గతిన అందుబాటులోకి తీసుకుని రావడము
5. త్వరిత గతిన న్యాయాన్ని అందించడానికి, లైంగిక వేధింపుల చట్టాలని నిపునులతో మార్పులు
6. ప్రతీ ఆడపిల్లకి స్కూల్స్ మరియు కాలేజి లలో 'self defense' ని నేర్పించడము