Pages

Sunday, September 22, 2013

నా కుటుంబం, తెలంగాణ లొ.....

..... వరంగల్ జిల్లా గోవిందరావుపేట లో చాల సంతోషం గ నా బాల్య జీవితం సాగిపోయింది. నాతో పాటు నా మిత్రులయిన రావింద్రచారి, శ్రీను, రాజేష్  ఇంకా  కొంత మంది పేర్లు గుర్తు లేని వారు ...... అప్పట్లో వాళ్ళకి తెలిసి ఉండదు మా తాతాలది ఆంధ్ర ప్రాంతం అని, మరియు  నాకు తేలీదు నేను ఆడుకునే  నా మిత్రులు తెలంగాణ వారు అని. 
 అప్పుడు మాకు తెలిసింది  సాయంకలమయితే సైకిల్ టైరు  వేసుకుని ఊరంతా తిరగడం, వెళ్లి వాగుల్లో దూకి ఆడుకోవడం.  వాడు పోయొత్త అన్నా, నేను వెళ్లి వస్తా అన్న, వాడు ఏందిరా అట్టున్నావ్ అన్నా , నేను ఏంటి రా అల ఉన్నావు అన్నా,  వాడు ఇంట్లో బతుకమ్మ ఆడిన, మా ఇంట్లో లేకున్నా  .....  ఏనాడు కూడా  వాడు వేరే, నేను వేరే అన్న భావన  కాని, వ్యత్యాసాలు కాని మాకు తెలియవు.  

KCR పుణ్యమా అని ఇక ఆ ఆనందం, తేడాల్లేకుండా ఉండే స్నేహం, నేను పెరిగినప్పటి వాతావరణం నా ఊర్లో పెరిగే  నా తరవాత తరానికి లేదేమో. ఒక మాట అంటే వాడి యాస ఏంటి నా యాస ఏంటి, అవతలి వాడు వొత్తు ఎకక్డ పెట్టాడు, నేను  ఎక్కడ పెట్ట, నా ఊర్లో నాతో పాటు  ఉండే  వ్యక్తి ఆంధ్ర వాడు కాబట్టి వాడు నన్ను దోచేసుకున్నాడు అనే భావన , ఈలాంటి కలుశితమయిన ఆలోచన లు ని స్ప్రెడ్ చెయ్యడం లో చాలా విజయం సాధించాడు KCR. 

మా నాన్న గారు చిన్నప్పుడు , అంటే మా తాత తను యుక్త వయసులో ఉన్నప్పుడు , మా ముత్తాత కృష్ణ జిల్లా  ని వదిలి గోవిందరావుపేట  వచ్చేసరట. కృష్ణ జిల్లా లో  ఆస్తులు అమ్ముకుని, గోవిందరావుపేట లో ఒక  ఇల్లు,కాస్త పొలం కొనుక్కుని (కొనుక్కుని - దోచుకుని కాదు ) వ్యవసాయం చేసేవారు మా తాతయ్య. అదే ఊర్లో దాదాపు 40-50 సంవత్సరాలు నుండి ఉంటున్నాము. మొన్న మొన్నటి  వరకు కూడా ఎవరికీ కూడా ప్రాంత తో కూడిన ఆలోచనలు లెవు. 
KCR   పదే పదే ఆంధ్ర వాళ్ళు మమ్ముల్ని  (వాడూ  ఆంధ్ర వాడె అనుకోండి) దోచేసుకున్నారు, గో బ్యాక్ ఆంధ్ర  అంటుంటే, చిరాకు వేసేది. అంత దోచేసుకుంటే 50 సంవత్సరాలుగా బ్రతుకుతున్న మాకు గాని మా ఊర్లో నివసిత్సున్న ఇంకా 100 ల ఆంధ్ర కుటుంబాలు గని ఎటువంటి తగువులు లేకుండా ఎలా బథుకుతున్నరు. తగువు లు పక్కన పెడితే ఊరి జనాలు మాకు ఎందుకు కాస్త ఎక్కువ గౌరవం ఇస్తారు??? 
నేను మా తాత  ని అడిగా తాతయ్య, గుడివాడ  లో అక్కడ పొలాలు బంధువులు స్నేహితులు ఉండగా అవన్నీ వదిలేసి కుటుంబం తో సహా  మీరు ఎందుకు వరంగల్ వచ్చారు అని. తెలంగాణ లో వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యడానికి, అప్పటికే వ్యవసాయం లో ముందు ఉన్న ఆంద్ర వారిని  రమ్మని ప్రభుత్వం ఆహ్వానిస్తే ఆస్తులు అమ్ముకుని వచ్చిన వేలాది కుటుంబాలలో మనము ఒకల్లము ర అని..... అల వచ్చిన ఆంధ్ర వాల్లే వరంగల్ లో  కానీ, మెదక్ లో కానీ, నిజామాబాదు లో కాని, ఖమ్మం లో గని ఉన్నారు అని. ఇక్కడ తెలుగు మీడియం లో పాటాలు చెప్పేవాళ్ళు లేకపోతే ప్రభుత్వం ఆహ్వానించి తీఉస్కుని వచ్చిన టీచర్స్ వాళ్ళలో ఉన్నారట.  తెలుగు పాటాలు  చెప్పలేకపోవడం ఏంటి అంటే, నిజాం పాలనలో తెలుగు ఎవరిని నేర్చుకునే అవకాశం కల్పించలేదు రా, అంత ఉర్దూ మీడియం అందుకే తెలంగాణా లో ఉర్దూ పదాల వాడకం ఎక్కువ అని ....... మరి అలా వ్యవసాయ  అభివృద్దికి, విధ్యభివ్రుద్దికి వచ్చిన వాల్లని గౌరవించడం పక్కనపెడితే,  దోచేసుకున్నారని  అనడం, ఉన్న చరిత్రని తొక్కిపెట్టి అసత్య ప్రచారం చేయడం ఏ లాభం కోసమో అందరికి  తెలుసు కాబట్టి చెప్పడం లేదు. 

1 ఇయర్ బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు మా ఊర్లో మా సందులో   ఉండే 90 సంవత్సరల లంబాడి అవ్వ పేరు కంటి, చెప్తుంది, మీ తాత  ఇచ్చిన వడ్ల తోటే నా పిల్లగాండ్లకు పెండ్లిళ్ళు చేసిన అని, మీ తాత నాయనమ్మ ఉన్నప్పుడు పండగలెక్క ఉండే అని.... 
నా చిన్నపుడు గుర్తు ఉంది, నేను 3 తరగతి చదువుతున్నపుడు కూడా ఊర్లో ముసలి వాళ్ళు కూడా నీ  బాంచన్ దొర అని కాళ్ళు పట్టుకోడానికి వంగే వాళ్ళు...... నాకు చాల బయం వేసేది ఎందుకు అంత పెద్ద వయసున్న తాత  అట్లా బాంచన్  అని కాళ్ళు పట్టుకున్తున్నాడు అని, మా నాయనమ్మ తాతయ్య  చూస్తె ఆయన్ని తిట్టే వాళ్ళు చిన్న పిల్లలకి అలా పెట్టకూడదు అని, మా ఇళ్ళలో ఇలాంటివి ఉండవు అని ............. తెలంగాణా లో దొర లు సామాన్య జనాన్ని ఎంతగా అణచివేసారో  తెలిపే చిన్న ఉధహరన అది . మేము దొరలము కాదు, కానీ ఏ పాటి చిన్న మేడ (కాంక్రీట్ బిల్డింగ్) తెలంగాణ లో ఉన్న, వాల్లని  దొర అని పిలవాలి, కింద కూర్చోవాలి, లాంటి పద్ధతులు  ఎంత లోతుల్లోకి ఉన్నాయో అర్ధమవుథున్ది. 

ఆంధ్ర కలవకముందే తెలంగాణ rich అని చెప్పేవారు, ఎందుకు ఎలా.... హైదరాబాద్ స్టేట్  ని పరిపాలించిన నిజాం , ప్రపంచం లో కల్ల  most  richest  prince  అయ్యాడో కూడా తెలుస్కుంటే కళ్ళు తిరిగే నిజాలు అర్ధమవుతాయి. 

తెలంగాణ లో సాయుధ పోరాటం లో, విద్య, వ వ్యవసాయం, ఉపాధి రంగాల అభివృద్ధి లో ఆంధ్ర వారి కృషి  ఎంతో ఉందని, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే, ఆంధ్ర వాళ్ళని నిష్కారణము గ తిట్టవలసిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. రాజకీయాలు సత్య అసత్య లా ఆధారముగా జరగడం లేదు కాబట్టి, కనీసం చదువుకున్న వారయినా సత్యాలని తెలుస్కోవాలన్న ఉద్దేశమే ఈ చిన్న  వ్యాసం. 


Sunday, May 12, 2013

అమ్మ నీ ప్రేమ కన్నా గోప్పదయింది, నేను పొందగలిగిన వేరొక ఆనందం అంటూ ఏమి లేదు

అమ్మ అన్నాక అందరి అమ్మలు గొప్పవారే, మా అమ్మ గొప్పది, వేరొకరి అమ్మ గొప్పది కాదు అనేది ఏమి లేదు...... 
కాని మానవ సహజం కదా... నా తల్లి అందరి  తల్లుల కన్నా కాస్త గొప్పది అనిపిస్తుంటుంది :-)

ఊర్లో మాకు పొలాలు గేదలు ఉండేవి అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మముత్తాత జేజమ్మ  తో ఊర్లో ఉన్దెవల్లము.. ఎంత హ్యాపీ లైఫ్, పోల్లల్లో తిరుగుతూ చదువు సంధ్య పట్టించుకోకుండా ఊరేమ్మట ఒక సైకిల్ టైరు వేసుకుని తిరగడం, గేటు బయటనుండే పుస్తకాల సంచి విసేరేసి రోడ్డు ఎక్కేయ్యడం .... నావి  అన్ని సబ్జెక్టు మార్కులు కలిపినా 50 దాటేవి కావేమో ...... అమ్మ కి మాత్రం పాపం నా మీద ప్రతిరోజు బెంగే, నేను ఎక్కడ ఆ ఊర్లో చిక్కుకుపోతనో, మా నాన్న లాగా ఏ ఆదాయం లేని ఆ వ్యవసాయం లో కూరుకుపోతనో అని.... ప్రతి రోజు తన  ఒల్లో కూర్చోబెట్టుకుని చదువుకుంటే ఎన్ని లాభాలో వివరిస్తూ ఉండేది..... , నా 5 తరగతి అనుకుంట, రోజు పక్కన అత్త వాళ్ళ ఇంట్లో నుండి తెలుగు పేపర్ తెప్పించి  చదివిపించేది, అప్పట్లో తెలుగు కూడా చదవడం వచెది కధు, మల్లీ తెలుగు మీడియం నాది :-)... మనకు అసలా  లోపల చదువుకోవాలని  అని ఉంటె కదా రావడానికి ..  ...  చిన్న తనం లో  తెలియక నేను అరుస్తూ నేను చదువుకోను నాకు ఇష్టం లేదు, నేను తాతయ్య లాగా వ్యవసాయం చేస్తా  అని పారిపోయెవన్ని.. 7 క్లాసు లో అనుకుంట, నా  మార్కులు చూసి తఃట్టుకోలేక ఏడ్చేసింది .... కనీసం 100 కి 32 మార్కులు  ఉంటె సంతోశాపదేశేమో పాస్ % అని..:-) మనకి పాస్ అవ్వడం అంటే చాల కష్టం ఆ రోజుల్లో ... కాని నన్ను చదువుకోసమని మా అమ్మ  ఏ రోజు కొట్టలేదు తిట్టలేదు, కోప్పడలేదు ..... 

అంతగా చదువుకోని మా అమ్మ విలువల విషయం లో చాల కచితంగా ఉన్దెధి... మా  అక్క వాళ్ళ ఫ్రండ్స్ (కోతి మూక, వానర సైన్యం, రాక్షస అంశ, దెయ్యాలు లాంటి వాళ్ళు గా అనిపించేది అప్పట్లో ) వచ్చి నేను పెంచే చెట్లని  పీకేస్తున్నారని వాళ్ళని తిట్టాను, కొన్ని బూతులు తిట్టి ఉంటాను లే .... ఆ రోజు కొట్టింది మా అమ్మ బెల్ట్ తో పిచ్చ పిచ్చ గ, అదే మొదటి సారి నన్ను కొట్టడం మా అమ్మ.... రెండో సరి మా అక్క మీద కోపాన్ని తట్టుకోలేక నన్ను చంప మీద కొట్టింది నా ఇంజనీరింగ్ లో .....తర్వాత  వచ్చి నన్ను పట్టుకుని బాధపడింది కొట్టానని, ఆ రోజు అంత నా పక్కనే పడుకుంది ... పిల్లల మీద చెయ్యి వేసేది కాదు అమ్మ, ఇన్ల్తొ ఎన్ని టెన్షన్ ఉన్న ఎంత పని ఉన్న, మా మీద కి అది చూపించేది కాదు  ....  . అమ్మ మాత్రం ఏ పని చేసిన చివరికి ఏమి లేక గేదలు కాసుకున్న సరే తలెత్తుకుని బతకడం ర ముఖ్యం అని చెప్పేది,....  అమ్మ ఏ పని ని  అయిన గౌరవించాలి ర అని చెప్పేది .... ..అప్పట్లో అమ్మ మాటల్లో లోతు అర్దమయ్యేది కాదు   ..... అమ్మ అప్పుడప్పుడు బాధపడుతుంటుంది అంతరి తల్లుల్ల్గా మీకు Boost లు లాంటివి ఇచ్చి పెంచుకోలేక పోయాను రా అని,....  ఏ boost ఇవ్వకుండానే ఇంత బూస్ట్ అయ్యింది బాడీ :-) నీ ప్రేమ వల్ల  అనుకుంట . ..... 
ఊర్లో ఆడవాళ్లు అంతా కలిసి కూర్చుంటే, కాసేపు అయ్యాక, వాళ్ళు అల వీళ్ళు ఇలా అని ఎవరన్నవేరే వాళ్ళ పైన  చెప్పుకుంటూ ఉంటె అక్కడనుండి  లెగిసి వచ్చేసేది.... అమ్మకి నచ్చదు ఒకల గురించి చెడు మాట్లాడుకోవడం .... వేరొకరి విషయాలు అమ్మకి తెలిసన, చివరకు ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరి పైన చెడుగా చెప్పేది కాదు.... , నేను ఇప్పటివరకు అమ్మ నోట్లో నుండి వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పడం వినలేదు ...... ఒకసారి అమ్మ నాతో సరదాగా మాట్లాడుతూ, పెళ్లి గురించి వచ్చి నేను "అమ్మ ఈరోజుల్లో అమ్మాయిలు ఎవరు కాలీగా ఉండటం లేదు, ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవాలేమో అని నవ్వుతూ అంటే, అమ్మ  "అలా అనకూడదు నాని , ఏ అమ్మాయి వేరేవరినో పెళ్ళిచేసుకోవాలని ఇంకొకళ్ళని ప్రేమించదు రా, వచ్చిన వాళ్ళని అర్ధం చేసుకుని బ్రతకాలి రా" అని.... ఏ చదువు లేని అమ్మ, పెళ్ళికోసం తప్పితే ఇల్లు దాటకుండా పెరిగిన అమ్మకు  ఇంత లోతైన ఆలోచనలు ఎలా .....?

8 తరగతి నుండి చదువులకోసం అమ్మకి దూరంగా ఉంటూ వస్తున్నా ... ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్న నాతో ఏమి చెప్పేది కాదు, ....అదే అలవాటు  ఇప్పటికి ఏమి చెప్పదు, నేను ఎక్కడ అలోచించి బాధపదథానో అని ఎవరిని చెప్పనిచ్చేది కూడా కాదు .....
అమ్మ నీ ప్రేమ కన్నా గోప్పదయింది, నేను పొందగలిగిన వేరొక ఆనందం అంటూ ఏమి లేదు ..... 
నీ మీద ఒట్టు పెట్టి ఒక సారి మాత్రం తప్పాను ... నన్ను క్షమించు ...... 

ఏ తల్లి చెడ్డది కాదు, ఏ తల్లి బిడ్డ సుఖాన్ని కోరుకోని వారు ఉన్దరు.... 
లోకం లో ఉన్న మాతృ మూర్తులందరికీ, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ......... 



Friday, April 12, 2013

బట్టలు ఊడతీసుకుని తిరుగుతున్న కాంగ్రెస్సు ప్రభుత్వము

బట్టలు ఊడతీసుకుని తిరుగుతున్న కాంగ్రెస్సు ప్రభుత్వము 

ఏలిన వారి బిడ్డ దోచుకునన్టున్నాడని, దాచుకోకుండా సమర్పించేసేసు కున్నారు మన రాష్ట్ర మంత్రులు . 

సమర్పించుకునేదేదో  ఆల్ల సొమ్మేదో సమర్పించుంటే బగున్డేది. మంది సోమ్మేగా!.....  మనకూ కాస్త విసిరేస్తాడెమో అని కుక్కల్లాగా, ఒక్కలన్ని మించి మరొకళ్ళు ఎగబడి ఎగబడి విశ్వాసాన్ని చూపించేసారు. మంచోళ్ళు ఎక్కువ కాలం బతకరు అన్తారు. ముంచే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు బతకరనుకుంట, అది పక్కన పెడితే రాజా వారు అందించిన దేవుడి పాలనని, ఆ దేవుడే వద్దని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. 

ఇప్పుడిక సినిమా మొదలు అయ్యిన్ధి. 
కెలుక్కుంటే కంపు గట్టిగ వస్తదని ప్రభుత్వం ముక్కు మూసుకుని నడుస్తుంటే, కంపు ఎవరి దగ్గర నుండి వస్తందో ఖచ్చితం గా తెలియల్సిందే అని కోర్టు CBI  విచారణ మొదలు పెట్టించింది. హీరో లక్ష్మి నారాయణ డిసైడ్ అయితే జగన్ గ్యాంగ్ చంచల్ గూడా  జైలు సైడ్ అయిపోద్ది. మెయిన్ విలన్స్ గాలి, విజయ సాయి రెడ్డి, మోపిదేవి, శ్రీ లక్ష్మి, క్యామిడి  విలన్స్ నిమ్మగడ్డ, ఎలుగుబంటి జైలు కెల్లిపొయరు. రింగ్ మేకర్ కింగ్ మేకర్ జగన్ ఎందుకైనా మంచిదని ముందే మూసేసాడు అనుకోండి . 
ధర్మాన పైన ఛార్జ్ షీట్ వేస్తే, చెయ్యి పట్టుకుని రాజీనామా చెయ్యకుండా ఆపేసాడు మన కిరన్. సభిత పాపం GO అంత చదివి సంతకం పెట్టేటప్పుడు కళ్ళు మూసుకుని పెట్టింది కాబట్టి తనన్నిహోము నుండి రాజీనామా చెయ్యద్దని కిరణ్ కాళ్ళ వెల్ల బతిమలాడి రాజీనామా చెయ్యకుండా చూసుకున్నాడు. తన కొడుకు పైన కబ్జా కోరు, ధగ కోరు, రౌడీ రాజు అని అభియోగాలు వస్తే, నా కొడుకు బంగారం, అన్నోళ్ళు అందరు గొడ్డు గారాలు అని చెప్పే మేడం గారు ఆవిదకావిడ ఎలాగు రాజీనామా చెయ్యదు, సిగ్గు లేకుండా వీళ్ళు వెళ్లి మీరు నిశ్చింతగా ఉండండి అవసరమయితే ప్రభుత్వ కర్చులతో లాయర్ ని అందిస్తాము అని ఆషాడమాసం సేల్ ఇచి వచ్చాడు కిరణ్ 
అసలా ఆ జీవితానికి సిగ్గు అన్నది ఏడిస్తే గా.......  ఎప్పటినుండో సిగ్గు లేకుండా తిరుగుతున్నాము, సిగ్గే లేని దానికి కోత్తగా చీర కట్టుకోవడం ఎందుకు అంటున్నాడు కిరణ్, చీర ఎట్టాగు  లేదు కనీసం సిగ్గు బిళ్ళ అన్న కట్టుకో మని జనాల గోల .... 

............. సర్వ అవినీతి పరులు, కాంగ్రెస్సు హయాం సుఖినో భవంతు ..............