నీ కోసం వేచే మనసుల్లో... ఆనదం కోసం ఈనాడు
నువ్వు చూసిన చీకటి రోజుల్లో... విజయపు వెలుగులు కోసం ఈనాడు
నీ మనసుని ఆకాశం లాగా.....ప్రతి క్షణము తెరిచే ఉంచు!
నీ భాదని రుద్రుని లాగా ....ఆ ఘరలము దాచే ఉంచు!
ఏరుగా పారే..., ఆ నది లోన, గాలికే ఊగే.. ఆ సడి ఆట
పోటుని ఆపే..., ఆ తీరాన, అలలుగా పాడే... ఆ మువ్వల పాట
ఆ గాలులు నిన్నూ తాకును లే
ఆ పాటలు నిన్నూ చేరును లే
నీ మనసుని ఆకాశం లాగా.....ప్రతి క్షణము తెరిచే ఉంచు!
నీ భాదని రుద్రుని లాగా ....ఆ ఘరలము దాచే ఉంచు!
నీ హృదయాన్నే.... నల్లని మేఘం కమ్మిందా
ఎర్రని సూరీడే..... పడమటి కనుమన దాగాడా
కళ్ళని తెరిచి..... ఎదురుగా నిలిచి..... ఎగసి చూడు ఆకాశం
.......
నల్లని మేఘం వెనక చల్లని వర్షం దాగుంది
పడమటి కనుమున ఎదుట, సూరీడు సిద్దముగా ఉన్నాడు
ఆ వర్షము నిన్ను తాకును లే, నీ మదిన ఒక చిగురు వేయును లే
ఆ సూరిని కాంతే తోడై, నీవు ఒక పూవుగా విరుయును లే...
ఆ దూరం దరిలో ఉంది..
ఆ రోజు నీకై వేచి చూస్తుంది ....
నీ కోసం వేచే మనసుల్లో... ఆనదం కోసం ఈనాడు
నువ్వు చూసిన చీకటి రోజుల్లో... విజయపు వెలుగులు కోసం ఈనాడు
నీ మనసుని ఆకాశం లాగా.....ప్రతి క్షణము తెరిచే ఉంచు!
నీ భాదని రుద్రుని లాగా ....ఆ ఘరలము దాచే ఉంచు!