ఇటీవల "గ్రేట్ ఆంధ్ర" లో "లోక్ సత్తా జే.పి దిగజారుడుతనము" ( http://telugu.greatandhra.com/sangathulu/1-05-2012/loksa_8.php ) అనే వ్యాసము ప్రచురితమయినది. అందులో లోక్ సత్తా ఉద్యమ నేతగా జే.పి గారు పేరు గడించారన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచినందుకు ధన్యవాదాలు. అయితే అందులో రచయిత జే.పి గారి వ్యక్తిత్వము, సైద్దాంతికత , రాజకీయ నాయకత్వము, విలువలు పై అ శాస్త్ర్రీయమయిన మరియు
సత్యదూరమయిన వ్యాఖ్యలు చేసారని బావిస్తున్నాను . ఈ విషయము లో గ్రేట్ ఆంధ్ర పాటకులకు నిజాలను శాస్త్ర్రీయ ఆధారాలతో పరిచయము చేయడము మా భాద్యతగా బావించి ఒక లోక్ సత్తా మద్దతు దారుగా ఈ సమాధాన వ్యాసము రాయడమయినది. ఈ వ్యాస ప్రచురణకు అంగీకరించినందుకు గ్రేట్ ఆంధ్ర యాజమాన్యానికి ముందుగా మా కృతజ్ఞతలు.
ఎన్నికల నాడు తెలంగాణా సమస్యపై లోక్ సత్తా మరియు ఇతర పార్టీల తీరు
తెరాస, BJP లాంటి పార్టీలు తెలంగాణా ప్రత్యెక రాష్ట్రమే అన్ని సమస్యలుకు పరిష్కారం అని ప్రచారం చేసాయి. కానీ BJP అధికారములో ఉన్నప్పుడు తెలంగాణా ని వ్యతిరేకించి మరలా ఎన్నికలప్పుడు ప్రమాణం చేసింది. తెదేపా, కాంగ్రెస్ లాంటి పార్టీలు సందర్భాన్ని బట్టి మాట చెపుతున్నాయి. గెలుపే ప్రధానమని ప్రజలకు ప్రత్యెక రాష్ట్రము ఇస్తామని చెప్పాయి. లోక్ సత్తా తెలంగాణ ఏర్పాటు వలన ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావని, ప్రజలు కోరుకుంటే రాష్ట్రము ఏర్పడుతుంది కానీ, సమస్యలకు పరిష్కారంగా వికేంద్రికరణ, విద్య, ఉపాధి లాంటి అజెండా ని ప్రచారం చేసింది.
డిసెంబర్ 9th ప్రకటనకు ముందు మరియు తర్వాత పార్టీల తీరు
అన్ని పార్టీల సమావేశంలో పార్టీలన్నీ దోబూచులాడాయి. అందరూ తెలంగాణాకి అనుకూలమని సంకేతం ఇచ్చాయి. లోక్ సత్తా మాత్రం ఈ సమస్యను ప్రజల దృష్టిలో, federal వ్యవస్థలో అలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మరియు చట్ట వ్యవస్థ చూపించే అలాంటి నిర్ణయాన్ని తాము మద్దతు ఇస్తామని చెప్పింది. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు జరిగిన సమావేశములో చెప్పిన మాట మార్చని పార్టీ లోక్ సత్తా. ప్రకటన తర్వాతప్రజల మనోభావాలను ఆసరాగా తీసుకుని, రెచ్చ గొట్టే ప్రసంగాలతో రాజకీయ పార్టీ లు ఆటలాడుకుంటుంటే, విద్యార్ధులు ఆవేశాలకు లోనయ్యి ప్రాణాలు తీసుకుంటుంటే, లోక్ సత్తా మాత్రమె తమపై దాడులకి కూడా వెరవకుండా, ఆంధ్ర ప్రాంతములో, " తెళంగాణ ఇస్తే నష్టమేమిటని?", తెళంగాణ ప్రాంతములో, "రాష్ట్ర సాధన సర్వ రోగ నివారిణి కాదు అని, కాబట్టి సమయమునతో వ్యవహరించాలని" సూచిస్తూ భావో ద్వేగాలను చల్లార్చే ప్రయత్నము చేసింది.
Telangana రాష్ట్రంపై లోక్ సత్తా మనోభావం
లోక్ సత్తా కానీ జయప్రకాశ్ నారాయణ గారు గాని ఏనాడూ తెలంగాణా ఏర్పాటుకి వ్యతిరేఖమని ప్రకటించలేదు మరియు వ్యతిరేఖంగా ప్రవర్తించలేదు. గణాంకాలు, ఆరోపణలు, సాక్ష్యాలు అన్ని ప్రాంతాల సమస్యలను చూపిస్తాయి. కానీ లోక్ సత్తా మూడు అంశాలను ఎప్పుడు గౌరవిస్తుంది - ప్రజల ఆకాంక్ష, రాజ్యాంగం మీద భక్తి మరియు ప్రజాసామ్యం లో చట్ట సభల ప్రాముఖ్యము. హోం మంత్రి ప్రకటనని గౌరవించాలని చెప్పింది. అందుకే నాడు శ్రీ కృష్ణ committee ని స్వాగతించింది. అదే committee గీత దాటిన నాడు విమర్శించింది. Governor ని అవమానించిన రోజు, విగ్రహాలు పగల గొట్టిన రోజు JP గారు ఖండిచారు. కొన్ని పార్టీలు వీటిని చూపించి లోక్ సత్తా తెలంగాణాకి వ్యతిరేఖమని ప్రచారం చేసారు కానీ రాజ్యాంగం పైన ఉన్నమరియు సమాజము పైన ఉన్న మక్కువను అర్థము చేసుకోలేదు. తెలంగాణా ప్రజల కోసం 610 జి.ఓ. మీద కానీ, 14 F గురించి గానీ, అవినీతి గురించి గాని, నీటి సమస్య మీద కానీ ఆయన చేస్తున్న కృషి మరుగున ఉండి పోయింది. ఆయన రాష్ట్ర అసెంబ్లీ లో తెలంగాణా సమస్యపై చర్చించాలని ప్రతి అసెంబ్లీ సమావేశానికి ముందు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇక తాత్సారము చెయ్యరాదని రాష్ట్రాన్ని అయోమయంలో ఉంచవద్దని ప్రధాన మంత్రి ని చిదంబరం గారిని కోరారు. వీధి పోరాటాలు మరియు ఆత్మ హత్యలు వద్దని చెప్పారు. ఇప్పుడు లోక్ సత్తా చెపుతున్నధీ అదే కానీ ఇతర పార్టీల విష ప్రచారం నుంచి ప్రజలను పార్టీ ని రక్షించాలని ప్రచార భాష ని సులభతరం చేసారు. సమగ్ర చర్చతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా తెలంగాణా ఏర్పాటు అయితే ఆహ్వానిస్తామని ప్రజలు కోరుకొంటే అలాగే జరుగుతుందని నమ్ముతున్నారు. ఇది పెద్ద మనిషి తనమే గాని దిగజారుడు తనం కాదు.
తెలంగాణా కోసం ఇప్పటివరకు లోక్ సత్తా ఏమి చేసిందంటే?
- డిసెంబర్ 9 ప్రకటన నిమిత్తము కేంద్ర ప్రభుత్వము ఒక మాట ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలని, రాజకీయ పార్టీ లు రోజుకోమాట కాకుండా నిబద్ధత తో ఉండాలని గట్టిగ నిలదీసింది. అందుకు ఒక ప్రత్యెక శాసన సభ సమావేసము వేసి చర్చించాలని తీర్మానము పెట్టారు.
- హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదని రాష్ట్రపతి ఉత్తర్వులోని 14F ని తొలిగించేందుకు విశేష కృషి చేసింది మరియు అందరిని ఒప్పించింది.
- అలాగే రంగారెడ్డి జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలముగా 610 GO అమలుకు పోరాటము చేసింది.
- హైదరాబాద్ నీటి సమస్య కోసం కృష్ణ phase -౩ ని పూర్తి చెయ్యాలని ప్రయత్నమూ చేస్తున్నది.
- అసలే నీరు తక్కువగా ఉన్న తెలంగాణా నుంచి గోదావరి నీటిని హైదరాబాద్ తరలించవద్దని వాదించింది.
- లోక్ సత్తా గెలిచిన కుకట్ పల్లి ని మోడల్ నియోజక వర్గంగా తీర్చి దిద్దుతున్నది ( http://kukatpallynow.com ) . ఇప్పటి వరకు 750 కోట్లు వెచ్చించి జలాశయాలు, రోడ్లు, బళ్ళు, పార్కులు ఇంకా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అసలు అయిన అజెండా విద్య మరియు ఉపాధి ని నమ్మి, trainings ఇప్పించి 2000 మంది కి ఉద్యోగాలు ఇప్పించారు.
- తెలంగాణా రైతు సమస్యలపై అధ్యయనం చేసి మార్కెట్ యార్డ్లు, కోల్డ్ storage కావాలని చెప్పారు. సిద్ధిపేట లో అది ఆచరణ లోకి తెప్పించారు. జలయజ్ఞం పేరుతో జరుగుతున్న స్కాములని అరికట్టాలని, ఆచరణ సాధ్యం కానీ ప్రాజెక్ట్లు కాకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే ప్రాజెక్ట్లు ఉండాలని, ఆ నిధులు మరియు ఆ నిర్ణయాలు స్థానిక ప్రభుత్వాలకి బదలాయించాలని లోక్ సత్తా వాదిస్తున్నది.
- తాత్కాలిక సహాయంతో ఊరుకోకుండా వరదల వల్ల ఆర్ధికంగా వెనుక బడి పోయిన నాలుగు గ్రామాల్లో శాశ్వత సహాయం ఉండేలా చెయ్యాలని లోక్ సత్తా నిర్ణయించింది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ కేసవరంలో పాటశాల కోసం మూడు తరగతి గదులు ఏర్పాటు చేసారు.
తెలంగాణా ఏర్పడినా ఏర్పాటు కాకున్నా లోక్ సత్తా పార్టీ గానీ, అలాంటి అజెండా ఉన్న పార్టీలు గెలిస్తే గానీ మన రాష్ట్రానికి లేక మన దేశానికీ అభివృద్ధి సాధ్యం కాదని మేము ఘాడంగా విశ్వసిస్తున్నాము.
కొన్ని ఆధారాలు
Do not dither on Telangana
Need to lift 14F
Lok Satta on Telangana
Lok satta work in model places in Telangana
Kukatpally http://www.kukatpallynow.com
ఇట్లు,
వెంకట కృష్ణ పెందుర్తి,
ఒక Loksatta కార్యకర్త.
Email: pendurthi.venkat@gmail.com
excellent article.
ReplyDeletegood commitment
ReplyDeleteGreat one..good article..
ReplyDeleteVinaya Videya Rama HD Video Songs Download
ReplyDelete