గగన సిఖరమ్మున గర్వమ్ముగా ఎగురుతున్న దేశ పతాకానికి నివాళులర్పించి,
నా దేశ చరిత సంపన్నమయినదని బహు విధమైనదని గర్వించి,
నా స్వతంత్రం త్యాగధనుల రక్తపు సేద్యమని మరొకసారి సరి కొత్తగా కనుగొని,
భావి భారతమునకు భాద్యతను గుర్తెరిగి, ప్రతిజ్ఞ పూనగ, ......
పడుమట్టి కనుమన సూరీడు అస్తమించాడు
గగన సిఖరంమున ఎగిరిన జెండా పుడమిని స్పృశించింది
ప్రతిజ్ఞ బూనిన మనసు నిశీధి కౌగిలి లో సేద తీరింది
మరొక ఆగష్టు 15 కోసం ఎదురు చూస్తూ స్వతంత్ర భారత పతాకం నాలుగు గోడల మధ్య సంవత్సర కాలపు సుధీర్గ నిద్ర లోకి జారుకుంది
No comments:
Post a Comment
Please comment...