తెలంగాణా రాష్ట్ర సాధన కోసం బలి దానానికి సిద్దమని ఆత్మ త్యాగం చేసుకుంటామని ప్రగల్భాలు పలికిన గొంతులు రాత్రి అవ్వగానే మత్తు మందులో తడిచి పోతుంటే, ఆ మాటలు విన్న సామాన్యుడు క్షనికవేసుడై తన ప్రాణాలని బలి తీసుకుంటున్నాడు. తన వారిని రోడ్ పైకి నెడుతూ మరొక ప్రాణం గాలి లో కలిసిపోయింది. యాది రెడ్డి ఆత్మ శాంతించాలని మరొక యాది రెడ్డి భవిష్యత్తులో కనపడరాదని ఆశిస్తున్నాను
మనసులు అవసరాలు విశ్వాసాలు ప్రాణాలతో ఆటలాడు వారికీ రాజకీయ వ్యాపారం బాగా కలిసి వస్తుది. వారు రేపిన చిచ్చు లో సామాన్యడు చితి మంటై వెలుగుతుంటే, ఆ వేడి లో చలి కాచు కుంటూ కాలం వెళ్ళదీస్తున్న మన రాక్షస నాయక ఘనం విందులు చేసుకుంటుంది.
ఈ రోజు రాజకీయం అంటే రెచ్చగొట్టడం, ఉసి గోల్పడం, ధ్వంసం చెయ్యడం, దుర్భాశాలడడం, విడతీయడం , విసృకలత్వాన్ని ప్రోత్సహించడం, అసహనం ప్రదర్శించడం.....
కేరళ లో ఒక కోర్టు కేసు లో తీర్పు చెప్తూ, "భరత మాత సహన శీలి, భారతీయులు సహనన్న్ని పాటించాలి" అని తీర్పు చెప్పింది. నేడు రాజకీయాల్లో అసహనాన్ని ప్రదర్శించడమే ఒక గొప్ప అర్హత..... అదే మనం చూపుతున్నం అదే మనం నేర్పుతున్నాము....
Camera ని మొహం పైకి ఫోకస్ చెయ్యగానే, ఆవేశాన్ని నరనరాన నటిమ్పచేసి చూపుతుంటే, అది నటన అని తెలియని ప్రజలు, కోపోద్రిక్తులై వారి సంఘటిత శక్తి ని తర తరాలు గా నెలకొల్పుకున్న చరిత్ర ని ద్వంసం చెయ్యడానికి, మహానుభావులు మార్గ నిర్దేశం చేసిన మన పూర్వీకుల విగ్రహాలను నెల కూల్చడానికి, సోదర భావం తో మెలిగిన వారి మధ్య యుద్ధ వాతావరణం కల్పించడానికి పని చేస్తున్నారు.
తెలంగాణా పేరు మీద, ట్యాంక్ బండి పైన ఉన్న విగ్రహాలు కూల్చేశారు, బావి రాజకీయాలకోసం పునాదులు వేస్తున్న J.P. లాంటి వారి పైన దాడులు చేసారు, నేడు ఏమి తెలియని ఏమి సంబంధం లేని ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన బల ప్రయోగం చేసారు
రాజకీయ నాయకులు పలికిస్తున్న వీరత్వానికి సామాన్యుడు మాత్రమే సమరం లో సమాధి గ మిగులుతున్నాడు....వాటిపై నిర్మించిన కోటల పై నాయకులు ప్రసంగా పాటలు వినిపిస్తున్నారు. చనిపోయే వారిని ఆపాల్సిన అవసరం నాయకులకి లేదు, ఆవేశానికి లోను కాకుండా ఉండాలన్న ఆలోచానా సామాన్యుడు కి రాదు........
Chala baaga rasaru sir!
ReplyDeleteThank you Atluri garu...
ReplyDeletemeekanna chinna vanni ....'Sir' endhukandi ....
Venkata Krishna garu... Nice articulation of thoughts from the viewpoint of a common man...
ReplyDeletegood thought annaya
ReplyDeleteIkkada kuda JP gurinchi ettaava!!!!!!!!!!!!!!!
ReplyDeletey not
ReplyDeletenice
ReplyDeletenee dhaggara goppa talent vundhi ra!!! chala baga rasav, JP aadharsalathoo mundhukelthunnav ana maata, good good.
ReplyDeletePlease correct spelling mistakes in Telugu. e.g. Shanikavesam
ReplyDelete