ఏమిటి ఈ ఎడబాటు కి కారణం ...?
కాలం మారిన తీరులో పెరిగిన దూరమా
వయసు ఇచ్చిన వాసనలతో చెరిగిన స్నేహమా
సంఘం ఊసులకు బయపడి దూరమైన మనసులా
అర్ధమే పరమార్ధముగా మస్తిష్కం చేసిన ఆలోచనలా
కారణం ఏదైనా కలుషితమైనది హృదయం
కర్కసమయినది దేహం
జ్ఞాపకాలే మనసు అగాధాల నడుమన దాచి ఉంచాను
అనుకున్న ఆశలే ఆశయాలు కాదని విదిల్చేసాను
స్వచతకు కాస్త దూరంగా
సరి కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తూ.......
No comments:
Post a Comment
Please comment...