..... వరంగల్ జిల్లా గోవిందరావుపేట లో చాల సంతోషం గ నా బాల్య జీవితం సాగిపోయింది. నాతో పాటు నా మిత్రులయిన రావింద్రచారి, శ్రీను, రాజేష్ ఇంకా కొంత మంది పేర్లు గుర్తు లేని వారు ...... అప్పట్లో వాళ్ళకి తెలిసి ఉండదు మా తాతాలది ఆంధ్ర ప్రాంతం అని, మరియు నాకు తేలీదు నేను ఆడుకునే నా మిత్రులు తెలంగాణ వారు అని.
అప్పుడు మాకు తెలిసింది సాయంకలమయితే సైకిల్ టైరు వేసుకుని ఊరంతా తిరగడం, వెళ్లి వాగుల్లో దూకి ఆడుకోవడం. వాడు పోయొత్త అన్నా, నేను వెళ్లి వస్తా అన్న, వాడు ఏందిరా అట్టున్నావ్ అన్నా , నేను ఏంటి రా అల ఉన్నావు అన్నా, వాడు ఇంట్లో బతుకమ్మ ఆడిన, మా ఇంట్లో లేకున్నా ..... ఏనాడు కూడా వాడు వేరే, నేను వేరే అన్న భావన కాని, వ్యత్యాసాలు కాని మాకు తెలియవు.
KCR పుణ్యమా అని ఇక ఆ ఆనందం, తేడాల్లేకుండా ఉండే స్నేహం, నేను పెరిగినప్పటి వాతావరణం నా ఊర్లో పెరిగే నా తరవాత తరానికి లేదేమో. ఒక మాట అంటే వాడి యాస ఏంటి నా యాస ఏంటి, అవతలి వాడు వొత్తు ఎకక్డ పెట్టాడు, నేను ఎక్కడ పెట్ట, నా ఊర్లో నాతో పాటు ఉండే వ్యక్తి ఆంధ్ర వాడు కాబట్టి వాడు నన్ను దోచేసుకున్నాడు అనే భావన , ఈలాంటి కలుశితమయిన ఆలోచన లు ని స్ప్రెడ్ చెయ్యడం లో చాలా విజయం సాధించాడు KCR.
మా నాన్న గారు చిన్నప్పుడు , అంటే మా తాత తను యుక్త వయసులో ఉన్నప్పుడు , మా ముత్తాత కృష్ణ జిల్లా ని వదిలి గోవిందరావుపేట వచ్చేసరట. కృష్ణ జిల్లా లో ఆస్తులు అమ్ముకుని, గోవిందరావుపేట లో ఒక ఇల్లు,కాస్త పొలం కొనుక్కుని (కొనుక్కుని - దోచుకుని కాదు ) వ్యవసాయం చేసేవారు మా తాతయ్య. అదే ఊర్లో దాదాపు 40-50 సంవత్సరాలు నుండి ఉంటున్నాము. మొన్న మొన్నటి వరకు కూడా ఎవరికీ కూడా ప్రాంత తో కూడిన ఆలోచనలు లెవు.
KCR పదే పదే ఆంధ్ర వాళ్ళు మమ్ముల్ని (వాడూ ఆంధ్ర వాడె అనుకోండి) దోచేసుకున్నారు, గో బ్యాక్ ఆంధ్ర అంటుంటే, చిరాకు వేసేది. అంత దోచేసుకుంటే 50 సంవత్సరాలుగా బ్రతుకుతున్న మాకు గాని మా ఊర్లో నివసిత్సున్న ఇంకా 100 ల ఆంధ్ర కుటుంబాలు గని ఎటువంటి తగువులు లేకుండా ఎలా బథుకుతున్నరు. తగువు లు పక్కన పెడితే ఊరి జనాలు మాకు ఎందుకు కాస్త ఎక్కువ గౌరవం ఇస్తారు???
నేను మా తాత ని అడిగా తాతయ్య, గుడివాడ లో అక్కడ పొలాలు బంధువులు స్నేహితులు ఉండగా అవన్నీ వదిలేసి కుటుంబం తో సహా మీరు ఎందుకు వరంగల్ వచ్చారు అని. తెలంగాణ లో వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యడానికి, అప్పటికే వ్యవసాయం లో ముందు ఉన్న ఆంద్ర వారిని రమ్మని ప్రభుత్వం ఆహ్వానిస్తే ఆస్తులు అమ్ముకుని వచ్చిన వేలాది కుటుంబాలలో మనము ఒకల్లము ర అని..... అల వచ్చిన ఆంధ్ర వాల్లే వరంగల్ లో కానీ, మెదక్ లో కానీ, నిజామాబాదు లో కాని, ఖమ్మం లో గని ఉన్నారు అని. ఇక్కడ తెలుగు మీడియం లో పాటాలు చెప్పేవాళ్ళు లేకపోతే ప్రభుత్వం ఆహ్వానించి తీఉస్కుని వచ్చిన టీచర్స్ వాళ్ళలో ఉన్నారట. తెలుగు పాటాలు చెప్పలేకపోవడం ఏంటి అంటే, నిజాం పాలనలో తెలుగు ఎవరిని నేర్చుకునే అవకాశం కల్పించలేదు రా, అంత ఉర్దూ మీడియం అందుకే తెలంగాణా లో ఉర్దూ పదాల వాడకం ఎక్కువ అని ....... మరి అలా వ్యవసాయ అభివృద్దికి, విధ్యభివ్రుద్దికి వచ్చిన వాల్లని గౌరవించడం పక్కనపెడితే, దోచేసుకున్నారని అనడం, ఉన్న చరిత్రని తొక్కిపెట్టి అసత్య ప్రచారం చేయడం ఏ లాభం కోసమో అందరికి తెలుసు కాబట్టి చెప్పడం లేదు.
1 ఇయర్ బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు మా ఊర్లో మా సందులో ఉండే 90 సంవత్సరల లంబాడి అవ్వ పేరు కంటి, చెప్తుంది, మీ తాత ఇచ్చిన వడ్ల తోటే నా పిల్లగాండ్లకు పెండ్లిళ్ళు చేసిన అని, మీ తాత నాయనమ్మ ఉన్నప్పుడు పండగలెక్క ఉండే అని....
నా చిన్నపుడు గుర్తు ఉంది, నేను 3 తరగతి చదువుతున్నపుడు కూడా ఊర్లో ముసలి వాళ్ళు కూడా నీ బాంచన్ దొర అని కాళ్ళు పట్టుకోడానికి వంగే వాళ్ళు...... నాకు చాల బయం వేసేది ఎందుకు అంత పెద్ద వయసున్న తాత అట్లా బాంచన్ అని కాళ్ళు పట్టుకున్తున్నాడు అని, మా నాయనమ్మ తాతయ్య చూస్తె ఆయన్ని తిట్టే వాళ్ళు చిన్న పిల్లలకి అలా పెట్టకూడదు అని, మా ఇళ్ళలో ఇలాంటివి ఉండవు అని ............. తెలంగాణా లో దొర లు సామాన్య జనాన్ని ఎంతగా అణచివేసారో తెలిపే చిన్న ఉధహరన అది . మేము దొరలము కాదు, కానీ ఏ పాటి చిన్న మేడ (కాంక్రీట్ బిల్డింగ్) తెలంగాణ లో ఉన్న, వాల్లని దొర అని పిలవాలి, కింద కూర్చోవాలి, లాంటి పద్ధతులు ఎంత లోతుల్లోకి ఉన్నాయో అర్ధమవుథున్ది.
ఆంధ్ర కలవకముందే తెలంగాణ rich అని చెప్పేవారు, ఎందుకు ఎలా.... హైదరాబాద్ స్టేట్ ని పరిపాలించిన నిజాం , ప్రపంచం లో కల్ల most richest prince అయ్యాడో కూడా తెలుస్కుంటే కళ్ళు తిరిగే నిజాలు అర్ధమవుతాయి.
తెలంగాణ లో సాయుధ పోరాటం లో, విద్య, వ వ్యవసాయం, ఉపాధి రంగాల అభివృద్ధి లో ఆంధ్ర వారి కృషి ఎంతో ఉందని, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే, ఆంధ్ర వాళ్ళని నిష్కారణము గ తిట్టవలసిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. రాజకీయాలు సత్య అసత్య లా ఆధారముగా జరగడం లేదు కాబట్టి, కనీసం చదువుకున్న వారయినా సత్యాలని తెలుస్కోవాలన్న ఉద్దేశమే ఈ చిన్న వ్యాసం.
Good Note Venkat
ReplyDelete