అమ్మ అన్నాక అందరి అమ్మలు గొప్పవారే, మా అమ్మ గొప్పది, వేరొకరి అమ్మ గొప్పది కాదు అనేది ఏమి లేదు......
కాని మానవ సహజం కదా... నా తల్లి అందరి తల్లుల కన్నా కాస్త గొప్పది అనిపిస్తుంటుంది :-)
కాని మానవ సహజం కదా... నా తల్లి అందరి తల్లుల కన్నా కాస్త గొప్పది అనిపిస్తుంటుంది :-)
ఊర్లో మాకు పొలాలు గేదలు ఉండేవి అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మముత్తాత జేజమ్మ తో ఊర్లో ఉన్దెవల్లము.. ఎంత హ్యాపీ లైఫ్, పోల్లల్లో తిరుగుతూ చదువు సంధ్య పట్టించుకోకుండా ఊరేమ్మట ఒక సైకిల్ టైరు వేసుకుని తిరగడం, గేటు బయటనుండే పుస్తకాల సంచి విసేరేసి రోడ్డు ఎక్కేయ్యడం .... నావి అన్ని సబ్జెక్టు మార్కులు కలిపినా 50 దాటేవి కావేమో ...... అమ్మ కి మాత్రం పాపం నా మీద ప్రతిరోజు బెంగే, నేను ఎక్కడ ఆ ఊర్లో చిక్కుకుపోతనో, మా నాన్న లాగా ఏ ఆదాయం లేని ఆ వ్యవసాయం లో కూరుకుపోతనో అని.... ప్రతి రోజు తన ఒల్లో కూర్చోబెట్టుకుని చదువుకుంటే ఎన్ని లాభాలో వివరిస్తూ ఉండేది..... , నా 5 తరగతి అనుకుంట, రోజు పక్కన అత్త వాళ్ళ ఇంట్లో నుండి తెలుగు పేపర్ తెప్పించి చదివిపించేది, అప్పట్లో తెలుగు కూడా చదవడం వచెది కధు, మల్లీ తెలుగు మీడియం నాది :-)... మనకు అసలా లోపల చదువుకోవాలని అని ఉంటె కదా రావడానికి .. ... చిన్న తనం లో తెలియక నేను అరుస్తూ నేను చదువుకోను నాకు ఇష్టం లేదు, నేను తాతయ్య లాగా వ్యవసాయం చేస్తా అని పారిపోయెవన్ని.. 7 క్లాసు లో అనుకుంట, నా మార్కులు చూసి తఃట్టుకోలేక ఏడ్చేసింది .... కనీసం 100 కి 32 మార్కులు ఉంటె సంతోశాపదేశేమో పాస్ % అని..:-) మనకి పాస్ అవ్వడం అంటే చాల కష్టం ఆ రోజుల్లో ... కాని నన్ను చదువుకోసమని మా అమ్మ ఏ రోజు కొట్టలేదు తిట్టలేదు, కోప్పడలేదు .....
అంతగా చదువుకోని మా అమ్మ విలువల విషయం లో చాల కచితంగా ఉన్దెధి... మా అక్క వాళ్ళ ఫ్రండ్స్ (కోతి మూక, వానర సైన్యం, రాక్షస అంశ, దెయ్యాలు లాంటి వాళ్ళు గా అనిపించేది అప్పట్లో ) వచ్చి నేను పెంచే చెట్లని పీకేస్తున్నారని వాళ్ళని తిట్టాను, కొన్ని బూతులు తిట్టి ఉంటాను లే .... ఆ రోజు కొట్టింది మా అమ్మ బెల్ట్ తో పిచ్చ పిచ్చ గ, అదే మొదటి సారి నన్ను కొట్టడం మా అమ్మ.... రెండో సరి మా అక్క మీద కోపాన్ని తట్టుకోలేక నన్ను చంప మీద కొట్టింది నా ఇంజనీరింగ్ లో .....తర్వాత వచ్చి నన్ను పట్టుకుని బాధపడింది కొట్టానని, ఆ రోజు అంత నా పక్కనే పడుకుంది ... పిల్లల మీద చెయ్యి వేసేది కాదు అమ్మ, ఇన్ల్తొ ఎన్ని టెన్షన్ ఉన్న ఎంత పని ఉన్న, మా మీద కి అది చూపించేది కాదు .... . అమ్మ మాత్రం ఏ పని చేసిన చివరికి ఏమి లేక గేదలు కాసుకున్న సరే తలెత్తుకుని బతకడం ర ముఖ్యం అని చెప్పేది,.... అమ్మ ఏ పని ని అయిన గౌరవించాలి ర అని చెప్పేది .... ..అప్పట్లో అమ్మ మాటల్లో లోతు అర్దమయ్యేది కాదు ..... అమ్మ అప్పుడప్పుడు బాధపడుతుంటుంది అంతరి తల్లుల్ల్గా మీకు Boost లు లాంటివి ఇచ్చి పెంచుకోలేక పోయాను రా అని,.... ఏ boost ఇవ్వకుండానే ఇంత బూస్ట్ అయ్యింది బాడీ :-) నీ ప్రేమ వల్ల అనుకుంట . .....
ఊర్లో ఆడవాళ్లు అంతా కలిసి కూర్చుంటే, కాసేపు అయ్యాక, వాళ్ళు అల వీళ్ళు ఇలా అని ఎవరన్నవేరే వాళ్ళ పైన చెప్పుకుంటూ ఉంటె అక్కడనుండి లెగిసి వచ్చేసేది.... అమ్మకి నచ్చదు ఒకల గురించి చెడు మాట్లాడుకోవడం .... వేరొకరి విషయాలు అమ్మకి తెలిసన, చివరకు ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరి పైన చెడుగా చెప్పేది కాదు.... , నేను ఇప్పటివరకు అమ్మ నోట్లో నుండి వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పడం వినలేదు ...... ఒకసారి అమ్మ నాతో సరదాగా మాట్లాడుతూ, పెళ్లి గురించి వచ్చి నేను "అమ్మ ఈరోజుల్లో అమ్మాయిలు ఎవరు కాలీగా ఉండటం లేదు, ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవాలేమో అని నవ్వుతూ అంటే, అమ్మ "అలా అనకూడదు నాని , ఏ అమ్మాయి వేరేవరినో పెళ్ళిచేసుకోవాలని ఇంకొకళ్ళని ప్రేమించదు రా, వచ్చిన వాళ్ళని అర్ధం చేసుకుని బ్రతకాలి రా" అని.... ఏ చదువు లేని అమ్మ, పెళ్ళికోసం తప్పితే ఇల్లు దాటకుండా పెరిగిన అమ్మకు ఇంత లోతైన ఆలోచనలు ఎలా .....?
8 తరగతి నుండి చదువులకోసం అమ్మకి దూరంగా ఉంటూ వస్తున్నా ... ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్న నాతో ఏమి చెప్పేది కాదు, ....అదే అలవాటు ఇప్పటికి ఏమి చెప్పదు, నేను ఎక్కడ అలోచించి బాధపదథానో అని ఎవరిని చెప్పనిచ్చేది కూడా కాదు .....
అమ్మ నీ ప్రేమ కన్నా గోప్పదయింది, నేను పొందగలిగిన వేరొక ఆనందం అంటూ ఏమి లేదు .....
నీ మీద ఒట్టు పెట్టి ఒక సారి మాత్రం తప్పాను ... నన్ను క్షమించు ......
ఏ తల్లి చెడ్డది కాదు, ఏ తల్లి బిడ్డ సుఖాన్ని కోరుకోని వారు ఉన్దరు....
లోకం లో ఉన్న మాతృ మూర్తులందరికీ, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు .........
bava.... gunde ni touch chesav...
ReplyDelete