Pages

Sunday, May 6, 2012

మారుతున్న జగన్ ....

ఎండాకాలం వదదేబ్బ కొట్టి చచ్చినోడు, వర్షాకాలం వానలకి చచ్చినోడు, పిడుగికి చచ్చినోడు, పాము కాటుకి చచ్చినోదు, మొగుడు బాధకి చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం బాధని తట్టుకోలేక చచ్చిన  భర్త ,  భర్త  బాధని తట్టుకోలేక చచ్చిన  పెళ్ళాం, కాదేది ఓదార్పు కి అనర్హం అన్నట్టు, కాతికేల్లిన  ప్రతి ఒక్కన్ని YSR కోసం చనిపోయాడని సినిమా చూపించి గత రెండున్నర సంవత్సరాలుగా ఒధర్చుకి తింటున్నాడు జగన్. రైతులు, మహిళలు, మద్యం, అప్పులు, నిరుద్యోగం, ఇలా సమస్య ఏదయినా సమాధానం మాత్రం ఓదార్పు యాత్రే జగన్ కి. మొన్నటికి మొన్న "నేనేగనక CM అయితే రాష్ట్రం లో అవినీతి లేకుండా చేస్తానని పెద్ద కామెడీ చేసేసాడు జగన్. పొద్దున్నే అయితే బురదగుంటలో బోర్లాడే ఆనందించే పంది "నాకే గనక   ఛాన్స్ వస్తే ఊర్లో బురద  లేకుండా చేస్తా" అన్నట్టుంది ఆ  ప్రకటన. మాటల్ల్లో కాస్త punch, force, ఉంటె చాలు దానికి అర్ధం పరమార్ధం పట్టించుకోకుండా విజిల్స్, చప్పట్లు కొట్టేస్తారు గాబట్టి షరా మామూలుగా దీనిక్కోడ్డా చప్పట్లు కొట్టేసి తిని పడుకున్నారు జనాలు. 
 

YSR ఆత్మ అయిన KVP, YSR కి నీడ  గా చెప్పుకునే సూరీడు ఇద్దరినీ తన దుడుసుతనం, అహంబావం తో దూరం చేసుకున్న గడసరి జగన్. సినీ హీరో రాజశేఖర్ ని కూడా తట్టుకోలేనంత, భరించలేనంత   అసూయ  కలిగిన జగన్  ధోరణిలో ఈ  మధ్య  మార్పు గమనించి ఆశ్చర్య  పోతున్న. ఎవ్వరిని నమ్మని, ఎవ్వరిని గౌరవించని , ఎవ్వరిని ఆత్మీయం గా ఫీల్ కాని జగన్ ఒంటెద్దు పోకడ ఈ మధ్య  కాస్త   మారినట్టు అనిపిస్తోంది. రాజకీయాలని ఈ రెండు సంవత్సరాల  కాలం లో కాస్త  రక్తం లో చేర్చుకున్నదేమో కాని వేరే వాళ్ళతో కలిసి వెళ్ళాలి అన్న ఇంగిత జ్ఞానం తత్ట్టినట్టుంది. జన్మత్: శత్రువులు అని ఫీల్ అయ్యే సామాజిక వర్గానికి దగ్గర కావాలనుకోడం, ఎవ్వరిని పట్టించుకోని లేదా ఉన్నవాళ్ళని కూడా దూరం చేసుకోగల   నేర్పరి అయిన  జగన్, మోహన్ బాబు ఇంటి గడప  తొక్కడం,  తెలుగు దేశం లోని కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీయడం, రోజా ని దువ్వి మల్లి దారి లో పెట్టడం, చూస్తూ ఉంటె జగన్ ధోరణి రాజకీయ  పరిణతి లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నై. ఎ పార్టీ గెలుస్తున్దనుకుంటే ఆ పార్టీ లో కి జంప్ చేసే జంపింగ్  జాక్ లు కి ప్రధాన  శిభిరముగా తయారయ్యింది  యువజన  శ్రామిక  రైతు (YSR ) కాంగ్రెస్  పార్టీ. 

ఇంగితం ఆలోచన , నైతికత , నాయకత్వ లక్షణాలు , న్యాయం, ధర్మము, ఆలోచింఛి నిర్ణయం తీసుకోగల  శక్తి మన జనాలకి లేదు గాబట్టి ఎలాగు 2009 లో కాంగ్రెస్ ని గెలిపించి అరగుండుగా మిగిలిన   రాష్ట్రాన్ని ఈ సారి YSR Congress  పార్టీ ని గెలిపించి పరిపూర్ణ  గుండుగా మారుస్తారేమో. 

No comments:

Post a Comment

Please comment...