Pages

Monday, December 26, 2011

వెయ్యి ధరువెయ్యి....

వెయ్యి ధరువెయ్యి....
వెయ్యి ధరువెయ్యి....


గండ్ర నిప్పున, అగ్ని కనికవలె
కారు మబ్బున, మేరిక మెరుపువలె
పోటు ఎత్తిన, నీటి కెరటమలే 
జడివాన ముందరి, వాయు రూపమలే 


వెయ్యి ధరువెయ్యి...
వెయ్యి ధరువెయ్యి


కష్ట మయితేనేమి, నష్టమయితే నేమి 
ఎవరున్టేనేమి, ఎవరు లేకనేమి
నీవంటి రక్తంబు చింతిస్తే నేమి 
నలు దిక్కులు మారు మ్రోగగా, ముల్లోకములు దద్దరిల్లగా 
వెయ్యి ధరువెయ్యి


జవసత్వములు జచ్చి నీరసించిన, జనులందరు చేరి ఉప్పెనవ్వగా, వెయ్యి ధరువెయ్యి !!
ఏటి కొకలైన వారు, కోటికోకలైన వారు, ఏకతాటిన ఎకమవ్వగా, వెయ్యి ధరువెయ్యి !!
సిగ్గు జచ్చి, ఎగ్గుజచ్చి, బానిస బతుకులు ఈడ్చు వారు, ఆత్మా గౌరవమున ఎదిరుంచి వానిగా, వెయ్యి ధరువెయ్యి !!
మేడలు వంచి, వెన్ను వంచి పన్ను గట్టిన జేతులు, బిగిసిన పిడికిలి తో ముఖము పగులగోట్టగా, వెయ్యి ధరువెయ్యి !!



గండ్ర నిప్పున, అగ్ని కనికవలె
కారు మబ్బున, మేరిక మెరుపువలె
పోటు ఎత్తిన, నీటి కెరటమలే 
జడివాన ముందరి, వాయు రూపమలే 


వెయ్యి ధరువెయ్యి...
వెయ్యి ధరువెయ్యి


4 comments:

Please comment...