Pages

Friday, May 20, 2011

for India..!!!????

అబ్దుల్ కలాం ఒక రోజు, ఒక చిన్న పాప తో, నీవు పెద్ద అయ్యాక ఏమి కావాలని కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు తను "అభివృద్ధి చెందిన భారత దేశం లో బ్రతకాలని కోరుకుంటున్న " అని చెప్పిందట. అది విన్న కలాం చేలించిపోయారట. నేను అప్పుడప్పుడు పాత పాటలు వింటూ ఉంటాను. ఒక రోజు నాకు ఇష్టమైన N.T.R. పాట వస్తుంది. "ఉంది లే మంచి కాలం ముందు ముందు న , అందరు సుకపడాలి నంద నందన' అని. అది 1950s లో రాసి ఉండి ఉండవచ్చు . ఆ పాట రాసిన కవి ఊహించి ఉనడక పోవచ్చు, భారతావనికి స్వతంత్రం వచ్చి ఆరు పదులు దాటినా ఆ మంచిరోజు రాలేదు అని.
నా స్నేహితులు, సన్నిహుతులు, నా చుట్టూ ఉన్నవారు, నా ఊరి ప్రజలు, యావత్ భారతదేశం కోరుకుంటుంది, భరత దేశం అభివృద్ధి చెందాలని. ఇన్ని కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నా అది ఆశించిన స్థాయి లో జరగడం లేదు. కాని  రాజకీయ నాయకులు కొన్ని వేల  మంది మాత్రమే ఉన్నారు, వారికీ కావలిసిన డబ్బు, అధికారం, బలగం, పలుకుబడి అన్ని సంపాదిన్చుకున్తున్నారు. ఎందుకు ప్రజలు గా మనం మాత్రం విఫలం చెందుతున్నాము. మన బాగు పేరు చెప్పి, మన సేవ చేస్తానని వెళ్ళిన వారు మాత్రం కోటానుకోట్లు సంపాదిన్చుకున్తున్నారు. 

మన లక్ష్యం మహోన్నతమైనది. 120 కోట్ల భారతీయులు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ప్రపంచ దేశాలలో భారత దేశం అగ్ర స్థానం లో ఉండాలని కోరుకుంటున్నాము, కాశ్మీర్ లో ఉన్న్న ప్రజలు గర్వంగా మేము భారతీయులం అని చెప్పుకోవాలని  కోరుకుంటున్నాము, చైనా , పాకిస్తాన్ మనలని కవ్విస్తే సరయిన సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాము . ఇంకా ఎన్నో ఎన్నో ఆశలు అశయాలు. కాని మన లక్ష్యానికి తగ్గ కృషి మనం చేస్తున్నామా? మన ఆశయాలని సాధించుకోవాలన్న పట్టుదల మనలో ఉందా? యిన్ని కోరికలు ఉన్న మనం రేపు ఎన్నికలు వచినప్పుడు, నా కులం వాడిని చూసో, నా మతం వాడిని చూసో, లేక పోతే నాకు డబ్బు ఇచిన వాడికో వోటు వేస్తాము. వాడు కబ్జా కోరు అయిన ఆ క్షణం లో పట్టించుకోము, రౌడీ అయిన పట్టించుకోము, మన అవసరాలకోసం పని చేస్తాడో లేదో కూడా పట్టించుకోము. మన కులమో మతమో గెలిస్తే చాలనుకున్టాము . కాని ఒక కులమో ఒక మతమో ఒక ప్రాంతమో గెలిచిన ప్రతీసారి మన దేశం ఓడిపోతుందని తెలుసుకోము. మనం ప్రలోభాలకి లోబడి వోటు వేసినంత కాలం, భారత దేశం అభివ్రుది చెందాలని కోరుకునే హక్కు మనకు లేదు. మన రేపటి తరాల వారి ముందు తల దించుకుని నిలబడవలసి వస్తుంది. 
భారత దేశ చరిత్ర లో అత్యధిక సమయం, ప్రపంచానికి మార్గ దర్శకం గా నిలచిన దేశం, ఈనాడు, అసమర్దుల చేతిలో పడి కన్నీరు కారుస్తుంది. మన మువ్వన్నల జెండా ఆనంద రెపరెపలు చూసుకోడానికి, భారత జాతి కీర్తి మరల నలు దిశలు వినిపించడానికి, మన చిన్నారులకి అభివ్రుది చెందిన మరియు  నిజమయిన భారత దేశం లో నివసించడానికి, ఒక నవ భరతావని రచించడానికి పౌర సమాజం సాహస నిర్ణయాలు తీసుకోన వలసిన సమయం ఆసన్నమయ్యింది. ఉన్నత లక్ష్యాలు ఉన్నత మయిన ఆలోచనల వల్లనే సాధ్యమవుతాయి. Do the right thing and do what it takes. నీ కోసం, సత్యం కోసం, విలువల కోసం, దేశ ఔన్నత్యం కోసం నిలబడ్డ వ్యక్తికి ఇచ్చే నీ మద్దతే వారికి చోదక శక్తి గా పనికి వస్తుంది, అదే మన దేశ గమనాన్ని సరయిన మార్గం లో పెడుతుంది. 

No comments:

Post a Comment

Please comment...