Pages

Wednesday, February 2, 2011

నా మనసార నిను స్మరామి

భరత ఖండమా నా మాతృ దేశమా
శాంతి రూపమా ఓ మృదుల కావ్యమా
సమర గేయమా ఓ శక్తి రూపమా
నమామి నమామి, నా మనసారా నిను స్మరామి


వేదమ్ముల జనయించిన గడ్డ అయి 
సత్య ధర్మమ్ములు పాటించిన జనులై 
ముల్లోకముల కీర్తించిన ఘనతై 
నమామి నమామి, నా మనసార నిను స్మరామి


తప:ఫలముల శోభతో
యగాఫలముల శక్తి తో
పుణ్యఫలముల కాంతి తో వర్ధిల్లు నా తల్లి భరత మాత 
నా మనసార నిను స్మరామి


2 comments:

  1. good one..
    Naa manasara smarami, kanna use manasa smarami( this gives the same meaning)

    ReplyDelete

Please comment...