Pages

Friday, December 17, 2010

మారని బతుకులు ....to KCR

 జాగో జాగో అంటావు...బాగో బాగో అంటావు
రక్తం చిన్దిస్తానంటావు
పాణం అర్పిస్తానంటావు
తెలంగాణా బిడ్డనంటావు
పోరు బాట పడుత నంటావు...
 పీకుని గాని లెక్క ఎందేందో పీకుతునట్టావ్
మాపటేల అయ్యిందా ....మందుగొట్టి పడుకొంటావ్


పగటి కళలు కల్ల సూపి ..............బంగారు బవిత సూపి
ఉడుకురక్తం ఉసి గొల్పి,........................ పెదోల్లకు ఆశ చూపి
నీ పబ్బం గడుపుకుంటావు ........కోట్లు కోట్లు వెనకేస్తావు


మంత్రి పదవి లేదని తెలంగాణా ఎత్తినావు
కేంద్ర..... మంత్రి పదవి వచ్చి నంక దొరికిన కాడికి దోచుకున్నావు
 రాష్ట్రాన్ని దోచుకున్నావు, దేశాన్ని దోచుకున్నావు ...
తెలంగాణా వస్తే గనక నువ్వేంది సేస్తావో మా కాంత ఎరకలే ...
ఉన్నదంతా ఒడిసి పడతావు డబ్బులుఅన్ని మూట గడ్తవు
రాష్ట్రాన్ని తకట్టెట్టి............... మా బతుకుల్ని బదనం చేస్తావు ....


తెలంగాణా వస్తే నువ్వేమో రాజవుతావు ...నీ కొడుకేమో మంత్రయితాడు
మేమేమో కూలి మాయె........ మా  బతుకులేమి మారవులే
కష్టిస్తేనే కాసు వస్తది ....... మా నోట్లోకి బువ్వేల్తాది ....

No comments:

Post a Comment

Please comment...