Pages

Friday, April 12, 2013

బట్టలు ఊడతీసుకుని తిరుగుతున్న కాంగ్రెస్సు ప్రభుత్వము

బట్టలు ఊడతీసుకుని తిరుగుతున్న కాంగ్రెస్సు ప్రభుత్వము 

ఏలిన వారి బిడ్డ దోచుకునన్టున్నాడని, దాచుకోకుండా సమర్పించేసేసు కున్నారు మన రాష్ట్ర మంత్రులు . 

సమర్పించుకునేదేదో  ఆల్ల సొమ్మేదో సమర్పించుంటే బగున్డేది. మంది సోమ్మేగా!.....  మనకూ కాస్త విసిరేస్తాడెమో అని కుక్కల్లాగా, ఒక్కలన్ని మించి మరొకళ్ళు ఎగబడి ఎగబడి విశ్వాసాన్ని చూపించేసారు. మంచోళ్ళు ఎక్కువ కాలం బతకరు అన్తారు. ముంచే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు బతకరనుకుంట, అది పక్కన పెడితే రాజా వారు అందించిన దేవుడి పాలనని, ఆ దేవుడే వద్దని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. 

ఇప్పుడిక సినిమా మొదలు అయ్యిన్ధి. 
కెలుక్కుంటే కంపు గట్టిగ వస్తదని ప్రభుత్వం ముక్కు మూసుకుని నడుస్తుంటే, కంపు ఎవరి దగ్గర నుండి వస్తందో ఖచ్చితం గా తెలియల్సిందే అని కోర్టు CBI  విచారణ మొదలు పెట్టించింది. హీరో లక్ష్మి నారాయణ డిసైడ్ అయితే జగన్ గ్యాంగ్ చంచల్ గూడా  జైలు సైడ్ అయిపోద్ది. మెయిన్ విలన్స్ గాలి, విజయ సాయి రెడ్డి, మోపిదేవి, శ్రీ లక్ష్మి, క్యామిడి  విలన్స్ నిమ్మగడ్డ, ఎలుగుబంటి జైలు కెల్లిపొయరు. రింగ్ మేకర్ కింగ్ మేకర్ జగన్ ఎందుకైనా మంచిదని ముందే మూసేసాడు అనుకోండి . 
ధర్మాన పైన ఛార్జ్ షీట్ వేస్తే, చెయ్యి పట్టుకుని రాజీనామా చెయ్యకుండా ఆపేసాడు మన కిరన్. సభిత పాపం GO అంత చదివి సంతకం పెట్టేటప్పుడు కళ్ళు మూసుకుని పెట్టింది కాబట్టి తనన్నిహోము నుండి రాజీనామా చెయ్యద్దని కిరణ్ కాళ్ళ వెల్ల బతిమలాడి రాజీనామా చెయ్యకుండా చూసుకున్నాడు. తన కొడుకు పైన కబ్జా కోరు, ధగ కోరు, రౌడీ రాజు అని అభియోగాలు వస్తే, నా కొడుకు బంగారం, అన్నోళ్ళు అందరు గొడ్డు గారాలు అని చెప్పే మేడం గారు ఆవిదకావిడ ఎలాగు రాజీనామా చెయ్యదు, సిగ్గు లేకుండా వీళ్ళు వెళ్లి మీరు నిశ్చింతగా ఉండండి అవసరమయితే ప్రభుత్వ కర్చులతో లాయర్ ని అందిస్తాము అని ఆషాడమాసం సేల్ ఇచి వచ్చాడు కిరణ్ 
అసలా ఆ జీవితానికి సిగ్గు అన్నది ఏడిస్తే గా.......  ఎప్పటినుండో సిగ్గు లేకుండా తిరుగుతున్నాము, సిగ్గే లేని దానికి కోత్తగా చీర కట్టుకోవడం ఎందుకు అంటున్నాడు కిరణ్, చీర ఎట్టాగు  లేదు కనీసం సిగ్గు బిళ్ళ అన్న కట్టుకో మని జనాల గోల .... 

............. సర్వ అవినీతి పరులు, కాంగ్రెస్సు హయాం సుఖినో భవంతు ..............