పతితులార, బ్రష్టులార, బాధాసర్ప ధ్రష్టులార!
ఏడవకండి ఏడవకండి ఏడవకండి, వస్తున్నాయి వస్తున్నాయి
జగన్నాధ జగన్నాధ జగన్నాధ జగన్నాధ .....రథచక్రాలు రథచక్రాలు రథచక్రాలు
జగన్నాధుని రథచక్రాలు రథచక్రాలు
వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి
పతితులార బ్రష్టులార
భయలు దేరినాయి భయలు దేరినాయి...... వస్తున్నాయి వస్తున్నాయి
జగన్నాధుని రథచక్రాలు రథచక్రాలు..............శ్రీ శ్రీ
ఎప్పుడో శ్రీ శ్రీ గారు చెప్పారు, రథచక్రాలు వస్తున్నాయని
ఓ అణగారిన వర్గ ప్రజలారా, ఓ దగాపడ్డ తమ్ములార, కండలుడికిన కార్మికులారా, ఏడవకండి ఏడవకండి, యా జగన్నాథుని రథచక్రాలు వస్తున్నై వస్తున్నాయి అని చెప్పారు
అవినీతిని అంతమొందించగా
పాపాన్ని పటాపంచలు చెయ్యగా
కుళ్ళుని కడిగివేయ్యగా
దొరల ధస్టికము తగులపెట్టగా............అహో!... వస్తున్నాయి వస్తున్నాయి అని ...
దగాపడ్డ తమ్మడు ఎప్పుడో కాటికి పోయాడు
అణగారిన జనం పాతాళానికి పాతుకుపోయాడు
కండలుడికిన కార్మికుడు ఆకలి కేకలతో గాలిలో కలిసిపోయాడు............
నాటి తరం మారింది నేటి తరం వచ్చింది, కాని ఏడుపు ఆగలేదు, సమస్యలు సమసి పోలేదు....
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు .....ఆ జగన్నాథుని రథచక్రం, ఏప్పుడు వస్తుంది..
దిక్కులన్ని ధద్ధరిల్లుతూ, ముల్లోకములు మారుమ్రోగుతూ
అగ్ని శికలే అరులు చాచుతూ
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఆ జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి...??