Pages

Tuesday, September 27, 2011

నీ మనసుని ఆకాశం లాగా....

నీ కోసం వేచే మనసుల్లో... ఆనదం కోసం ఈనాడు
నువ్వు చూసిన చీకటి రోజుల్లో... విజయపు  వెలుగులు కోసం ఈనాడు

నీ మనసుని ఆకాశం లాగా.....ప్రతి క్షణము తెరిచే ఉంచు!
నీ భాదని రుద్రుని లాగా ....ఆ ఘరలము దాచే ఉంచు!

ఏరుగా పారే..., ఆ నది లోన, గాలికే ఊగే.. ఆ సడి ఆట
పోటుని ఆపే..., ఆ తీరాన, అలలుగా పాడే... ఆ మువ్వల పాట
ఆ గాలులు నిన్నూ  తాకును లే 
ఆ పాటలు నిన్నూ  చేరును లే


నీ మనసుని ఆకాశం లాగా.....ప్రతి క్షణము తెరిచే ఉంచు!
నీ భాదని రుద్రుని లాగా ....ఆ ఘరలము దాచే ఉంచు!

నీ హృదయాన్నే....  నల్లని మేఘం కమ్మిందా 
ఎర్రని సూరీడే.....  పడమటి కనుమన దాగాడా
కళ్ళని తెరిచి..... ఎదురుగా నిలిచి..... ఎగసి  చూడు ఆకాశం
.......
నల్లని మేఘం వెనక చల్లని వర్షం దాగుంది
పడమటి కనుమున ఎదుట, సూరీడు సిద్దముగా ఉన్నాడు 

ఆ వర్షము నిన్ను తాకును లే, నీ మదిన ఒక చిగురు వేయును లే 
ఆ సూరిని కాంతే తోడై, నీవు ఒక పూవుగా విరుయును లే...
ఆ దూరం  దరిలో ఉంది..
ఆ రోజు నీకై వేచి చూస్తుంది ....


నీ కోసం వేచే మనసుల్లో... ఆనదం కోసం ఈనాడు
నువ్వు చూసిన చీకటి రోజుల్లో... విజయపు  వెలుగులు కోసం ఈనాడు

నీ మనసుని ఆకాశం లాగా.....ప్రతి క్షణము తెరిచే ఉంచు!
నీ భాదని రుద్రుని లాగా ....ఆ ఘరలము దాచే ఉంచు!


Wednesday, September 21, 2011

రాజా వారి కానుకలు





రాజాది రాజ మహారాజ రాజ మార్తాండ శ్రీ శ్రీ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు దసరా కానుకగా కిలో రెండు రూపాయలు ఉన్న బియ్యాన్ని ఒక రూపాయి కే ఇస్తూ ఈరోజు దండోరా వేసారు. అంతే కాకుండా ఇక నుండి ప్రతీ ఆరు నెలలకి ఒక సారి ఒక కొత్త పధకము తో వస్తానని కూడా మాట ఇచ్చారు.
 అసల ముందు ఈ పదకాలని అమలు చెయ్యడానికి డబ్బులు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే అసలు ఎవరు అడిగారని ఈ పధకాన్ని ఇప్పుడు ప్రకటించారు. పేద వాడు తినడానికి తిండి లేక, ఆకలి తో బాధ పడుతున్నవానికి నాలుగు మెతుకులు పెడితే ఏ తలాకాయ ఉన్నవాడు కాదనడు . కాని ఎవరి కడుపులు నింపడానికి ఈ పధకం. అసలా ఈ పధకం అమలు అయ్యేపరిస్తుతులు ఉన్నాయా. మన రాష్ట్రం  లో వై.ఎస్ గారు చేతికి ఎముకలేనట్టు గా కర్ణుణ్ణి   మించిపోయి, అడిగిన వారికి అడగని వారికి, చివరికి చనిపోయిన మహాత్మా గాంధీ గారి పేరు మీద కూడా తెల్ల కార్డు ని మంజూరు చేసేసారు. ఆ విధము గ,  స్వ స్వర్గస్తులు అయిన వై. ఎస్  దయతో ఈ రోజు మన రాష్ట్రము లో ఉన్నవారందరు పేదవారే. కాబట్టి బలిసినోడికి బక్క చిక్కినోడికి అన్న తేడా లేకుండా కిలో రూపాయికే బియ్యాన్ని పంపిణి చేస్తున్నారు మహారాజ వారు.

రాజు గారు కానుకలు విదిల్చి కళ్ళు మూసుకుంటే, రాజ సేవకులు నోరు తెరుచుకుని పందికొక్కుల్ల దొరికిన కాడికి మేసేస్తున్నారు. ప్రభుత్వ పంపిణి వ్యవస్తః లో ఈరోజు కనీసం సగానికి పైగా దొంగల పాలు అవుతుంది. అన్నీ దొంగ  లెక్కలే. RTI లో బాగంగా ఒక రేషన్ షాప్ ని తనికీ చేసి అందులో పంపిణీ చేసాము అని ఉన్న వారిని వెళ్లి అడిగితే లెక్కల్లో ఉన్న వారెవవ్రికి రేషన్ చేరలేదు. ఇలా ఉంది మన పంపిణీ వ్యవస్థ.
 ఒక పక్క కష్టించి పండించిన రైతు గిట్టు బాటు ధరలేక పంటలు వెయ్యడమే మానేసి ఇంట్లో కూర్చుంటుంటే ఎవరిని ఉద్దరించడానికి మరి ఈ కిలో రూపాయి పధకము. ఇక్కడ రూపాయికి బియ్యాన్ని అందివ్వడానికి  అక్కడ  రైతులకి మద్దతు ధర పెంచరు. సిగ్గు ఉనడాలి ఎదన్న పధకాన్ని ప్రకటించే ముందు. ప్రజలు అడగరు కాబట్టి ఏదైనా చేసేస్తారు. దీనికన్నా రాజులే బాగా చేసారు. ఇక ఇటువంటి వాటిని ప్రకటించడానికి మద్యాన్ని ఊరూరా వాడ వాడల ఏరులై పారిస్తారు. సంవత్సర సంవత్సరానికి పెంచుకుంటున్న మధ్యపు ఆదాయం చూస్తే ఎవ్వరికైనా అర్ధం అవుతుంది. ఈరోజు Youngistan ప్రోగ్రాం లో బొత్స సత్యన్నారాయణ సిగ్గు లేకుండా రెండు జిల్లాల్లో మధ్యపు వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకోచాడు, అటువంటి వాడు మద్యాన్ని ఎందుకు కంట్రోల్ చేస్తాడు. 

మళ్ళీ  అధికారం లోకి రావడం ఒక్కటేనా ధ్యేయం, విద్య వైద్యం అభివృద్ధి ఎందుల్లో బాగున్నామని మనం. శ్రీలంక తో పోల్చుకున్న్న  మనం దిగదుడుపే. ఏదో 1991 సంస్కరణల మూలంగా  దేశం అభివ్రద్ది చెందుతుంది కాబట్టి ఆ గాలి లో పడి  కొట్టుకు పోవడమే తఃప్పితే నిజమయిన నిజాయితీ  అయిన నాయకత్వాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని మరియు దేశాన్ని సరికొత్త  మార్గం లో నడిపించగల సత్తువ లేకుండా పోయిందీ నాయకత్వానికి. 

ఇలా ప్రభుత్వాలు ఉంటె ప్రతిపక్షాలు ఇంకా గోరం, ఎన్ని సార్లు ఎన్ని ప్రతిపక్ష పార్టీ లు నిజమయిన ప్రజా సమస్యలపైన  పోరాడినాయి. గత రెండు సంవత్సరాలనుండి గన్ ది జగన్ రాష్ట్ర మంతా ఒదారుస్తూనే ఉన్నాడు ఇంకా ఓదార్పు లు కాలేదట. మార్పు మార్పు అంటూ వచ్చాడు ది స్టార్ మెగా స్టార్, వచ్చిన మొదటి రోజు నుండి టికెట్స్ అమ్మడం మొదలు పెట్టి ప్రజారాజ్యం పార్టీ ని  కాంగ్రెస్ గ మార్చే వరకు ఎన్నో మార్పులు చేసాడు పాపం. చిరు ని చూస్తే నవ్వు తప్పితే కనీసం కోపం కూడా రావడము లేదు, ప్రజారజ్యానికి వోటు వేసినవాడు ఎంత బాధ పడుతున్నాడో పాపం. ఇక మన బాబు గారు,  ఈరోజు ఒకటి అంటాడు, దాన్ని వదిలేస్తాడు రేపు ఇంకోటి, రెండు రోజులాగి మరోటి, దేనికి ఏ సమస్యకి పరిష్కారం చూపాడు. ఇక KCR తన  గురిచిన ప్రస్తావనే అనవసరం. వరసగా బందులు, తనకి తన కుటుంబానికి  ఏమిటి నష్టం  వాళ్ళ కార్లలో వాళ్ళు  చక్కగ తిరుగుతున్నారు. సామాన్య ప్రజలకి  బయటకి వెళ్ళడానికి బస్సులు లేవు, వైద్యానికి డాక్టర్ లు లేరు, వస్తువులు కొనాలంటే షాప్ లు లేవు. తెలంగాణా పేరుతో  మహా గొప్ప రాజకీయ  కోట ని కట్టుకుంటున్నాడు. తెలంగాణా ని వ్యతిరేకిన్చాడము చేయడం లేదు కాని ఇదేనా తన పంధా, ప్రజలని ఇబ్బంది పెట్టడమా ఉద్యమము అంటే. 

ప్రజలు ఏ రోజైతే బోల్డ్ గా నిజాయితీగా ఆలోచిస్తారో, ఏ రోజైతే నాయకులని వారు వేసే వోటు బ్యాంకు  వేశాలని  నిలదీస్తారో ఆరోజు వరకు ఇలా మాట్లాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది. 
సత్తా ఉన్నవారు ప్రజలలో నిలబడి  ప్రత్యామ్న్యాయం ఇస్తాము, కొత్త రాజకేయ్యాన్ని అందిస్తాము అని చెప్పి, మరియు చెప్పిందే చేస్తూ ఉంటె,  కనీసం వారిని గుర్తించే  సత్తా కూడా ప్రజలలో లేకపోవడం దురదృష్ట కరము....