నా చిన్నతనం లో మా నాయనమ్మతో తో నాకు ఉన్న అనుభంధం, చిన్నతనం లో జరిగిన విషయాలు కొన్ని రాసుకున్నాను. అవే ఇక్కడ కొన్ని ....
నా చిన్న తనం చాలా భాగం మా ఊరు గోవిందరావు పేట లోనే గడిచింది. మా ఇంట్లో నేను, అక్క అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, జేజమ్మ, ముత్తాత మొత్తం 8 మంది ఉండేవాళ్ళం .... చాలా సరదాగా ఉండేది. నాయనమ్మ పేరు కృష్ణ భాయి, అందరు కృష్ణమ్మా అనే వాళ్ళు. నా పేరు లో ఉన్న కృష్ణ మా నానమ్మ పెరులోదే. మా ఇంటికి పెట్టుకున్న పేరు కూడా 'శ్రీ కృష్ణ నిలయం' ...
మా నాయనమ్మ చూడడానికి సినిమాల్లో చూపించే నాయనమ్మ లాగానే ఉంటుంది, వెంకటిగిరి చీర, పెద్ద బొట్టు, మొహానికి పౌడర్, జడలో పూలు, కొంచెం బొద్దుగా ఉండేది. చాలా అమాయకురాలు. మా నాయనమ్మ కి నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి చిన్నప్పుడే చనిపోయింది, తను పాకుతూ వెళ్లి దేవుడు దగ్గర పెట్టిన గడ్డ జున్ను తిని, అది అరగక చనిపోయింది అని చెప్పేది. మా నాయనమ్మ కొడుకుల పేర్లు రాజ రావు, ప్రతాప్, సురేంద్ర, నరేంద్ర. నేను ఒక రోజు అడిగాను "నాయనమ్మ మీ అబ్బాయిలకి పేర్లు ఎవరు పెట్టారు అని, 'నేనే పెట్టారా , నా కొడుకులు అందరు రాజాల్ల బతకాలని రాజుల పేర్లు పెట్టా అని. '
ఆ రోజు elections , మా నాయనమ్మ అద్దం ముందు కూర్చుని కనీసం గంట సేపు తయారయ్యింది, బయటికి వెళ్లి ఓటు వెయ్యాలని అనుకుంట, ...... మొత్తం బాగా తయారయ్యి, ఇంటి గేటు వరకు వెళ్ళింది , అక్కడ మా నాయనమ్మ ఫ్రెండ్స్ వెయిటింగ్ నాయనమ్మ కోసం, గేటు దగ్గరనుండి నాయనమ్మ అరుపు, "ఏవండి ఓటు ఎవరికీ వెయ్యాలి?" అప్పుడు మా తాతగారు,...... "గంట సేపు సింగారించావు, అప్పుడు అడగలేదు, బజార్లో నే అడగాల ?, తెలుగు దేశానికీ వెయ్యి. " అంటే? ఏది ...... "సైకిల్ గుర్తు ఉంటది దానికి వేసి రా" . ఇలా బయట విషయాలు ఏవి తెలీదు అన్ని తాతయ్యే, మా తాత complete opposite అనుకోండి, చదువుకున్న కలెక్టర్ కన్నా మా తాత కే ఎక్కువ తెలుసు అనుకుంట విషయాలు. మహా మేధావి... మా thatha గారు చదివింది 2nd క్లాసు కానీ, ఒక్క ఇంగ్లీష్ ముక్క అన్న లేకుండా సెంటెన్స్ మాట్లాడేవారు కాదు.
ఒకరోజు ఇంటికి కూలి పని చేసిన వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు, తాత గారు రేపు రమ్మన్నారు, మరుసటి రోజు వస్తే ఈ రోజు కాదు మల్లి రేపు రమ్మన్నారు. మా నయనమ్మ ఆకక్డే ఉంది అన్ని చూసి, కూలి వాళ్ళ ముందే, "ఆ బీరువాలో ఉన్న డబ్బులు ఏదో వాళ్ళకి ఇవ్వచు గ ఎ రోజు క రోజు లేవని మల్లి రమ్మంటావు... అల తిప్పించుకో కూడదు పాపం తగులుద్ధి అని" మా తాత గారు చూడాలి మా నాయనమ్మ అన్న దానికి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.
నేను నాయనమ్మ ఒకక్ రోజు కలిసి సినిమా చూస్తున్నాము ఇంట్లో టీవీ లో, ఎవడో వచ్చి సినిమాలో ఒక అమ్మాయి ని కతి తో పొడవాలి, వాడు వచ్చి పొడిచిన క్షణమ లో మా నాయనమ్మ "ఇదేమి మాయరోగం, సచ్చినోడు, ఆడపిల్ల అని కూడా చూడకుండా అల పోదిచేసాడు, వీడి ముదనష్టం అవ్వ అని......ఇంకా ఏదో ఏదో ...." సినిమా ని సినిమా గ చూడలేక పోయేది, సినిమా చూసిన రోజు ఎదన్న ఏడుపు సీన్ వచిందంటే ఇక ఆ రోజు అంత తలుచుకునేది....
ఒక రోజు సాయం కాలం బయట మంచం వేసుకుని కూర్చున్నాము ఇంట్లో అందరం ఉన్నట్టు ఉన్నాము ' ఇక ఆ రోజంతా ఒక్కటే టాపిక్ " మా పెధననగారు అన్నయ్యని కొట్టారు అంట ... " పిల్లలని అసలా ఎలా కొడతారు, అసలా చూడలేక పోతున్నాను ఇవన్ని, నేను కొట్టకుండా ఎవరి పైన చెయ్యి వెయ్యకుండా నలుగురి కొడుకుల్ని పెంచలేద అని, ఇంకా పిల్లల్ని కొట్టడం మానకపోతే నేను హైదరాబాద్ కి రాను అని చెప్పి వచ్చేసా అని చెప్పింది "... ఇలా ఎవరు ఏడ్చినా బాధ పడిన అది సినిమా అయిన నిజం అయిన ఒర్చుకునేది కాదు.
ఇంట్లో గీధలకి పేర్లు దూడలకి పేర్లు, పెట్టేది.
ఒక రోజు అక్క నేను కొట్టుకుంటూ ఉంటె కత్హి పీత వచ్చి నా గడ్డానికి గుచుకుని రక్తం రావడం మొదలు అయింది. అది చూసిన మా నాయనమ్మ నన్ను ఎతుకుని రోడ్ పైన ఏడ్చుకుంటూ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది... ఇలా చాల సెన్సిటివ్. ఇంకా ఎన్ని ఎన్నో జ్ఞాపకాలు మా నాయనమ్మ వి నా మది లో ఉంది పోయాయి.
మా నాయనమ్మ కాన్సెర్ తో చని పోయింది. చనిపోయే సమయానికి చాల బక్కగా నీరసం గ ఉండేది. చాల నరకం గ ఉండేది .. చాల బాధ ని అనుభవించింది.. ఎంత నీరసమ యిన ఎంత పేయన్ ఉన్న ప్రతి రోజు స్నానం చేసి నుదిటి న పెద్ద బొట్టు పెట్టుకుని దేవుడికి దన్నం పెట్టుకొని రోజు లేదు అనుకుంటున్నా. ఎవ్వరు కొంచెం బాధపడ్డ చూడలేని నాయనమ్మ తఃనే ఎంతో బాధ పది చనిపోవడం నిజమగ చెప్పలేని బాధ... పండగ వస్తే మూడు నలుగు నెలలకి సరిపడా వంటలు వందే నాయనమ్మ తను చనిపోయ్సే సమయానికి, తను కట్టుకున్న చీఅరని కూడా బరువుగా ఉంది ర మోయలేక పోతున్న అనేది....
మా నాయనమ్మ చనిపోవడానికి ముందు నాతో అనేది
కృష్ణ నీ పిల్లలకి నా పేరు పెట్టుకో
ఇంటి విషయాలు బయట చెప్పకూడదు ... ఇంటి రహస్యాలు బయటకి చెప్తే పోయేది మన ఇంటి పరువే ర
మీ తాత అన్నం పెదతంటే వద్దు అంటదు... అదో అలవాటు అంతే వదన్న పెట్టండి
మీ నాన్న పిచోడు ర, ఆడ పిల్ల కి పెళ్లి ఎలా చేస్తాడో
..........
నాయనమ్మ చనిపోయి కనీసం 6 or 7 సంవత్సరాలు అయినట్టుంది కానీ నాకు నా లైఫ్ లో ఎన్ని సార్లు గుర్తు వస్తదో నాకే తెలియదు... మా నాయనమ్మ స్ఫూర్తి అమాయకత్వం జాలి ఎన్నటికి మరువలేనివి