Pages

Monday, November 14, 2011

చంద్రబాబు మనోగతం (on CBI inquiry) ...


ఛ... ఈ రాధా కృష్ణ కి పని పాట లేదు ..... వెళ్ళేవాడు ఒక్కడు పోక నన్ను వెంటేసుకుని పోయాడు ఆ youngitsan ప్రోగ్రాం కి .....చప్పట్లు కొడితే సంకలు గుద్దుకుని ఎమన్నా నేను ఆ రోజు......."తమ్ముడు నా పైన వచ్చిన అవినీతి ఆరోపణలు నువ్వు రుజువు చేయగలిగితే నా ఆస్తి నీకు రాసిస్తా, నిరూపించగలవా?" అని సవాలు విసిరా....'ABN youngistan' ప్రోగ్రాం లో. వినే వాడు పోరాగాడే  కదా అని సవాలు విసిరా..., మరి ఈ హై కోర్ట్ గని విన్నదో ఏమో... నా పైన విచారణకి ఆదేశించింది.... ....


అయినా, నా నా గడ్డి తిని, మామ పైకి చెప్పులు విసిరి, బావ పై బూతు పురాణం ఎత్తుకుని, NTR ని పదవిలో నుండి దించి, అందరిని మేనేజ్ చేస్తూ తొమ్మిది సంవత్సరాలు ఎండా వాన అని లేకుండా బండ లాగ పని చేస్తే, ఆ మాత్రం కూడబెట్టుకోనివ్వకపోతే ఇంక ముక్య మంత్రి  పదవి ఎందుకు.  అసలే కార్యకర్తల పార్టీ ఆయే, వచినాడికి మందు విందు, రాని వాడికి చదివింపులు బుజ్జగింపులు, బాబులకి  క్రికెట్ బాట్ లు, పాపాలకి సైకిల్ లు, అమ్మలకి చీరలు, ఆడపడుచులకి కుంకమ బరెనలు, బాబాయిలకి బీరు బాటిళ్ళు , ఎక్కడనుండి వస్తాయనుకున్టాయో ఈ కోర్ట్ లు....... నల్ల కోఅటేసుకుని, తెల్ల బుగ్గ కారు లో వచ్చి..... విచారణ చేయండి అంటే సరిపోయిందా.... వీళ్ళకి రాజకీయం చేయమని ఇస్తే తెలిసేది  నా ఈ బాధ లు .....


తొమ్మిది సంవత్సరాలు ముక్క్యమంత్రి గా చేసి, గత ఆరు నెలలనుండి రాష్ట్రము అంతా అవినీతికి వ్యతిరేకము గ ప్రచారం చేస్తున్ననా  లాంటి  వారిపైకి ఇలాంటి కేసులు పెడుతుంటే ఇంక సామాన్యుల సంగతి ఏంటి......అసలా ప్రభుత్వం ఉందా లేదా... ? వెంటనే ముక్క్య మంత్రి దిగిపోయి నన్ను మళ్ళీ CM ని చేస్తే సరిపోద్ది....
రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే బాగుండేది, అసెంబ్లీ లో ఒక సారి......., మీడియా ముందు రెండు  సార్లు తిట్టుకుని , తలుపు చాటు కెళ్ళి తందనాలు ఆడేవాళ్ళం ........చూసినోల్లు ఎవడు పెద్ద దొంగో కనిపెట్టేలోపు మాల్లో సారి తిట్టుకుంటే సరిపోయేది.....ఆ రోజులే వేరు........ ఈ మధ్య కోర్ట్ లు మరీ ఎక్కువ చేస్తున్నాయి, ..... చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా....


ప్రజలు నా మీద ప్రేమ తో ఇచిన పన్నుల డబ్బులతో మూడు సింగపూర్లు ఆరు స్విస్స్ బ్యాంకులు, ఆ విధంగా ముందుకు పోతుంటే, చూసి తట్టుకోలేని వాళ్ళు కుట్ర పన్ని ఇలా చేస్తారా............ అయినా... కోపం ఉంటె తిట్టాలి, సవాలు విసరాలి, ఉమ్మేయ్యాలి, ....అంతే కానీ ఇలా కోర్ట్ గడపలేక్కుతరా....నేను ఇప్పటి వరకు మీడియా ముందు వందల మందిని తిట్ట...... కానీ ఎవరిపైనన్న కోర్ట్ లో కాసు వేసానా....ఆ మాత్రం Vision లేకుంటే రాజకీయాలు ఎట్లా చేస్తారు ఏమో .......నా సంగతి గాని ఎమన్నా అటు ఇటు కావలి, అందరి బాగావతాలు బయట పెడతా.....